ఇమేజ్ పెంచుకోవటంలో మోడీకున్న తెలివి సమకాలీన ప్రపంచంలో మరే నేతకు లేదనే చెప్పాలి. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశానికి వచ్చే వెసులుబాటు లేదనే మాటను ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి అమెరికా ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరవటమే కాదు.. మోడీని తమకు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. విన్నంతనే కాకమ్మ కథ వినేందుకు మేమే దొరికామా? అని మీరు అనొచ్చు. కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారినట్లు చెబుతున్నారు. ఓపక్క అమెరికా అధ్యక్షుడు.. మరోపక్క జపాన్ ప్రధానమంత్రితో పాటు.. బ్రిటన్ ప్రధాని.. ఇలా సంపన్న దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు ఉన్నా.. మోడీ ముందు వారంతా దిగదుడుపే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా వచ్చిన ఒక వార్త ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. జీ7సమ్మిట్ సందర్భంగా మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులార్టీ ఎంతన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు..ఆస్ట్రేలియా ప్రధాని చెప్పటం విశేషం. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో బైడన్ ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
దీంతో.. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు తమను కూడా భాగస్వామ్యం చేయాలన్న విషయాన్ని బైడన్ ను పలువురు కోరుతున్నారట. అనేక వర్గాల నుంచి తనకు ఒత్తిళ్లు వస్తున్న విషయాన్ని మోడీకి బైడెన్ తెలియజేసినట్లు చెబుతున్నారు. తనను ఎప్పుడు కలవని వారు.. పరిచయం లేని వారు సైతం ఫోన్ ద్వారా సంప్రదిస్తూ.. మోడీతో కలిపించే అవకాశం గురించి విన్నపాలు చేస్తున్నట్లు చెప్పటం గమనార్హం. ఈ సందర్భంగా మోడీని ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ బైడెన్ సరదాగా అడిగినట్లుగా చెబుతున్నారు.
మోడీతో బైడెన్ వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలోనే అక్కడకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ సైతం.. బైడెన్ ఎదుర్కొంటున్న సమస్యనే తాను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక కార్యక్రమంలో మోడీ పొల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంకు తాము కూడా వస్తామని పలువురు తనకు మెసేజ్ లు పంపుతున్నారని పేర్కొన్నారు.
అయితే.. మోడీ పాల్గొనే వేదికకు 20వేల మంది సామర్థ్యమే ఉందని.. దానికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయమయాయని… తమకు టికెట్లు కావాలంటూ బోలెడన్ని వినతులు వస్తున్నట్లుగా పేర్కొన్నట్లుగా.. వారి సంభాషణలు విన్నవారు చెప్పినట్లుగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కలుగజేసుకొని.. మోడీ తనకు పెద్ద సమస్యగా మారారని.. ఇదేమీ తాను ఆట పట్టించటం లేదని.. కావాలంటే తమ టీంను అడగాలని అన్నట్లు చెప్పగా.. ఆస్ట్రేలియా ప్రధాని కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందన్న ప్రచారం జరుగుతుంటే.. అందుకు భిన్నమైన వాదన తెర మీదకు రావటం.. అది కూడా అంతర్జాతీయం కావటం ఆసక్తికరంగా మారింది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…