Political News

నెల్లూరులో క‌త్తులు నూరుతున్న‌ బాబాయ్‌-అబ్బాయ్

నెల్లూరు రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. వైసీపీలోని సొంత నాయ‌కులు అందునా వ‌రుస‌కు బాబాయి, అబ్బాయి అయ్యేవారే.. రోడ్డున ప‌డ్డారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఆయ‌న బాబాయి, వైసీపీనాయ‌కుడు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. రూప్‌కుమార్‌ అనుచరుడు హాజీపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమారే కిరాయి మనుషులతో దాడి చేయించారని రూప్‌కుమార్‌ ఆరోపించారు. మేమంతా కష్టపడి ఎన్నికల్లో అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే ఇప్పుడు మాపైనే దాడి చేశారని రూప్‌కుమార్ మండిపడ్డారు. మేం ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే అది నీ ఊహకే అందదంటూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను ఘాటుగా హెచ్చరించారు. ఇదిలావుంటే, నగరంలో ఎవరు ఎవరి పై దాడి చేసినా.. తనకే అంటగడుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను నోరు విప్పితే వారి చరిత్రలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. రూప్‌కుమార్‌ ఒక అంతర్జాతీయ దొంగని.. నోటీసులు వచ్చిన సంగతి మర్చిపోవద్దంటూ అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ వ్యవహారంలో కొందరు చేసిన పాపాలకు ఇప్పటికీ తాను భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మ‌రోవైపు.. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువురు నేతలను పిలిచి సీఎం జగన్ సర్దిచెప్పారు. కలిసి పని చేయాలని సూచించారు.

ఇది జరిగిన పది రోజులకే ఇరువురు నేతలు వీధికెక్క‌డంతో వైసీపీ రాజ‌కీయాలు ఆ పార్టీకి చేటు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు సంధించిన అనిల్ కుమార్ యాద‌వ్‌.. ఇప్పుడు బాబాయి వ‌రుసయ్యే నేత‌పై ఇలా విరుచుకుప‌డుతుండ‌డంతో పార్టీ అధిష్టానం త‌ల‌ప‌ట్టుకుంది.

This post was last modified on May 21, 2023 12:33 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

24 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago