గతంలో కొన్ని కొన్ని చోట్ల దయ్యం ఉందనే భయంతో ఓ స్త్రీ రేపురా! అని గుమ్మాలకు ఉన్న తలుపు చెక్కలపై రాసుకునేవారు. ఇప్పుడు సీబీఐ వారు.. ఓ ఎంపీ రేపు రా! అని తమ ఆఫీస్‌కు బోర్డు కట్టుకు న్నారా? అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీఎం తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి సాగుతుండడమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
విచారణ పేరుతో అధికారులు ఎంపీని పిలవడం.. ఆయన ఏదో ఒక కారణంగా తప్పించుకోవడం.. జరుగుతూనే ఉంది. దీంతో నెటిజన్లు.. జరుగుతున్న పరిణామాలపై వ్యంగ్యోక్తులు సంధిస్తున్నారు. ఇక, తాజాగా అవినాష్ రెడ్డి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ఇదిలావుంటే, సీబీఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చి న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాష్‌రెడ్డి మార్గమధ్యంలోనే వెనుదిరిగారు. ఆయన మాతృమూర్తికి ఆరోగ్యం బాగోలేదని పులివెందుల నుంచి సమాచారం రావడంతో ఎంపీ వెనుదిరగడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ఎంపీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ.
వాస్తవానికి నాలుగు రోజుల కిందటే ఆయన విచారణకు రావాల్సి ఉంది. కానీ… ‘ఇంత ఆకస్మికంగా పిలిస్తే రాలేను. ముందస్తు కార్యక్రమాలున్నాయి’ అని తెలిపారు. దీంతో శుక్రవారం తప్పనిసరిగా రావాలని అప్పుడే సీబీఐ అధికారులు చెప్పారు. అవినాశ్‌ను అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని సీబీఐ ఇదివరకే స్పష్టం చేసిన తరుణంలో ఉత్కంఠ కూడా పెరిగింది. మరి ఇప్పుడు సోమవారం వరకు వాయిదా ఉండడంతో .. ఏం చేస్తారో చూడాలి. దీనిపైనే నెటిజన్లు ఆసక్తిక ర కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 20, 2023 4:47 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…