తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును ఒక విజనరీగా అభివర్ణిస్తారు చాలామంది. విజన్ 2020 అంటే నవ్విన వాళ్లు.. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఆయన విజన్‌ను కళ్లారా చూస్తున్నారని అంటారు. చంద్రబాబు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. అది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉంటుందని అభిమానులు ఆయన్ని కొనియాడుతుంటారు. బాబుకు టీడీపీ వాళ్లు మరీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపించినా.. ఆయన విజనరీ అనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం 2 వేల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బాబు విజన్, ఆయన ఆలోచన తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. 2 వేలు సహా పెద్ద నోట్లను రద్దు చేస్తే దేశంలో అవినీతి, బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ చాలా తగ్గుతాయని ఆయన ఎప్పట్నుంచో చెబుతున్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు చేసినపుడు ఆయన మద్దతు పలికారు. అది జరగాలని ముందే అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2 వేల నోటు విషయంలో ఆయన ముందు నుంచి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు.
2 వేల నోట్లను రద్దు చేయాలని కొన్ని నెలల ముందు కూడా గట్టిగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే నిర్ణయం ప్రకటించడంతో బాబు అభిమానులకు ఆయనకు సోషల్ మీడియాలో ఎలివేషన్ ఇస్తున్నారు. బాబు విజన్ అలా ఉంటుందని.. ఆయన చెబితే జరిగి తీరుతుందని కొనియాడుతున్నారు.
ఐతే కేంద్రం నుంచి బాబుకు ముందే సమాచారం ఉందా.. అందుకే ఈ రకంగా మాట్లాడారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అందుకోసం నిధులు సమకూర్చి పెట్టుకున్న ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికే మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని.. ఇది వైరి పక్షాలకు గట్టి దెబ్బే అన్న చర్చ కూడా నడుస్తోంది. చంద్రబాబుకు ముందే ఈ అంచనా ఉంది కాబట్టి ఆయన ఈ విషయంలో జాగ్రత్త పడి ఉంటాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికల కోసం భారీ మొత్తంలో 2 వేల నోట్లతో నిధులు దాచి పెట్టిన వాళ్లకి మాత్రం ఇది పెద్ద ఇబ్బందే.
This post was last modified on May 20, 2023 11:01 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…