Political News

బీఆర్ఎస్ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ ?

రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు.

ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించటమే బ్యాలెన్సుంది అనుకుంటున్న సమయంలో కోర్టు స్టే ఇచ్చింది. కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటుచేయటాన్ని అఖిలభారత యాదవ సంఘంతో పాటు మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరం చెప్పటమే కాకుండా కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఆ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలపై స్టే విధించింది. కోర్టు ఆదేశాలు అయ్యేంతవరకు విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని ఆదేశించింది.

ఇక్కడ విషయం ఏమింటే విగ్రహాన్ని ఏర్పాటుచేసేంత ఎన్టీయార్ పై అభిమానం మంత్రి పువ్వాడ అజయ్ లో లేదు. అయితే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుచేశారనే పేరుతో కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎన్టీయార్ అభిమానుల ఓట్లను వేయించుకోవటమే పువ్వాడ ప్లాన్. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలుపు అనుమానం. కమ్మ సామాజికవర్గంలోనే పువ్వాడంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కమ్మ సంఘం ఎన్నికల్లో స్వయంగా పువ్వాడ మద్దతిచ్చి, ప్రచారం చేసిన వ్యక్తి ఓడిపోయారు.

ఆ ఎన్నికల్లోనే మంత్రికి సామాజికవర్గంలో కూడా పట్టులేదన్న విషయం బయటపడింది. అప్పటినుండి వచ్చేఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలన్నదే పువ్వాడను పట్టి పీడిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు, జూనియర్ ఎన్టీయార్ ను పిలవటం అనేది ఒక ఆప్షన్ గా చేసుకున్నారు. ఎన్టీయార్ జపంచేయటం ద్వారా అయినా సామాజికవర్గం ఓట్లు వేయించుకోవాలన్నది పువ్వాడ వ్యూహంగా కనబడుతోంది. అయితే దానికి కోర్టు అడ్డుపుల్ల వేసింది. 25వ తేదీన ఇదే విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మాత్రమే తాము వ్యతిరేకమని పిటీషనర్లు స్పష్టంచేస్తున్నారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి. 

This post was last modified on May 19, 2023 5:09 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

47 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago