ఏమాటకామాట చెప్పుకోవాలి తెలంగాణలో సీనియర్లు ఎవరూ సహకరించకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ కేసీఆర్‌తో నిత్యం తలపడుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎలా అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ బట్టలూడదీయడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు.. డీకే తరహాలోనే ఎంత డబ్బయినా ఖర్చు చేసి ఎన్నికలలో విజయం సాధించడానికి ముందుకెళ్తున్నారు.
సీనియర్ల నుంచి సహకారం లేకపోయినా రాహుల్ గాంధీ దగ్గర పట్టు సంపాదించడంతో పాటు రాష్ట్రంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటుచేసుకుని కేసీఆర్‌తో తలపడుతున్నారు రేవంత్ రెడ్డి. కానీ… కర్ణాటకలో అంతా తానై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన డీకే శివకుమార్‌కు అంతా ముగిశాక సీఎం సీటు ఇవ్వకుండా మొండిచేయి చూపించినట్లే తెలంగాణలో ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్‌ను సీఎం సీటుకు దూరం చేస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఉండడంతో బీజేపీ వాటిని అడ్డంపెట్టుకుని ఇబ్బంది పెడుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సీఎం చేయలేదన్నవాదన ఒకటి ఉంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డిపైనా టీడీపీలో ఉన్నప్పటి నాటి ఓటుకు నోటు కేసు ఉంది. అంతేకాదు.. పార్టీ గెలిచాక అంతా తమ ఘనతే అని చెప్పుకొనే సీనియర్ల బ్యాచ్ కూడా అడ్డం తిరుగుతుందన్న అంచనాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఇలా, ఒకరేమిటి సక్సెస్ సాధించాలే కానీ దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యే సీనియర్లు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి కూడా తన మిత్రుడు శివకుమార్‌కు జరిగిన అనుభవం చూసిన తరువాత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ నుంచి కూడా సీఎం సీటు విషయంలోనూ హామీ తీసుకోవాలనుకుంటున్నారని.. లేదంటే శివకుమార్ మాదిరిగానే తానూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తన సన్నిహితులు వద్ద బయటపడినట్లు సమాచారం. అయితే, నాన్చుడు బేరంలో నంబర్ 1 అయిన సోనియా, రాహుల్ గాంధీలు రేవంత్‌కు అలాంటి హామీ ఇస్తారా అనేదీ అనుమానమే. ఒకవేళ హామీ ఇచ్చాక మిగతా కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో సహకరిస్తారా అనేదీ అనుమానమే.
This post was last modified on May 18, 2023 5:11 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…