పార్టీ ఆఫీసులో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో పార్టీకి 105 సీట్లు వస్తాయని ప్రకటించారు. 119 సీట్లలో 105 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయనటం మామూలు విషయం కాదు. కేసీయార్ చెప్పిన లెక్క కరెక్టయితే బీఆర్ఎస్ కు దాదాపు 90 శాతం సీట్లు వస్తాయని అనుకోవాలి. మరి నిజంగానే అన్ని సీట్లు వస్తాయా ? క్షేత్రస్ధాయిలో బీఆర్ఎస్ కు అంత సీనుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కొద్దిరోజుల క్రితం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతు సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో 45 మంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు స్వయంగా కేసీయారే చెప్పారు. అంతమంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు కేసీయారే చెప్పారంటే వాళ్ళ అవినీతి ఇంకా ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. జనాల్లో కేసీయార్ పాలనపైన బాగా వ్యతిరేకత ఉందనటంలో సందేహంలేదు.
ఆటో డ్రైవర్లు, తోపుడు బండ్లవాళ్ళు, మార్కెట్లో కూరగాయల వర్తకులు..ఇలా ఎవరిని కదిలించినా కేసీయార్ ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఇదే మంట వచ్చేఎన్నికల్లో ఓట్లు వేసేటపుడు చూపుతారో లేదో తెలీదు. ఇప్పటికైతే మండిపోతున్నది వాస్తవం. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉన్నది వాస్తవమే అని ప్రశాంత్ కిషోర్ ఆమధ్య నిర్వహించిన సర్వేల్లో కూడా బయటపడిందని వార్తలు వినిపించాయి. ఏ విధంగా చూసినా కేసీయార్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంటే మరి 105 సీట్లు ఎలాగ వస్తాయి ?
వ్యతిరేకత ఉన్నా అధికారంలోకి వస్తే రావచ్చు చెప్పలేం. ఎందుకంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవటం వల్ల బీఆర్ఎస్ లాభపడితే లాభపడచ్చు. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. కాకపోతే బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలుస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని కేసీయార్ చెప్పటాన్ని చాలామంది నమ్మటంలేదు. పార్టీ మీటింగులో చెప్పారు కానీ నిజంగానే అన్నిసీట్లు వస్తాయని కేసీయార్ కన్నా నమ్మకం ఉందా అనే డౌటు పెరిగిపోతోంది. మరి కేసీయార్ జోస్యం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 18, 2023 2:37 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…