జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోకీలక భూమిక పోషించాలని తపిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే పొత్తుల లెక్కను ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తుగా చెప్పే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జనసైనికులకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్లైంది.
గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఒక్క సీటు మాత్రమే దక్కించుకోవటం తెలిసిందే. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ సొంతంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలు కావటం తెలిసిందే. పార్టీ గుర్తింపు కోసం అవసరమైనన్నిఓట్లు.. సీట్లు సాధించకపోవటంతో ఈసీ పవన్ పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా మార్చింది. ఈ నిర్ణయంతో ఏపీలో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఎవరికైనా ఈ గుర్తును పొందే అవకాశం ఉంటుంది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ.. ప్రాంతీయ పార్టీలనుఎన్నికల సంఘం ప్రకటించగా.. అందులో 8 పార్టీలు జాతీయ హోదా దక్కించుకోగా.. ఐదు పార్టీలకు ప్రాంతీయ హోదాను కల్పించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పేరు ఈ జాబితాలో లేకపోవటం షాకింగ్ గా మారింది. 2024లో టీడీపీతో పొత్తుకు వెళ్లే జనసేనకు తాజా పరిణామం ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
ఈసీ నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు పడాలి. అదే సమయంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇది జరిగితేనే.. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చినప్పటికి రెండు ఎమ్మెల్యే సీట్లను గెలవకపోవటంతో.. పార్టీ గుర్తును ఫ్రీ సింబల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 25 ఎంపీస్థానాల్లో ఏ ఒక్క దానిలో విజయం సాధించినా.. సింబల్ ఉండేది. కానీ.. అలా కూడా జరగలేదు. తాజా పరిణామంపై పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారు. ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on May 17, 2023 4:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…