Political News

అమిత్ షా పిలిస్తే అందుకే వెళ్లలేదు.. షాకిస్తున్న నిఖిల్ మాటలు

కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. తన మార్కు సినిమాల్ని చేసే నిఖిల్ కు కార్తికేయ 2 భారీ బ్రేక్ గా చెప్పాలి. అతడి కెరీర్ గ్రాఫ్ ను పెంచేసిన ఈ మూవీతో అతని రేంజ్ పెరిగింది. తాజాగా అతను హీరోగా గ్యారీ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల కావటం తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీతో తీసిన ఈ మూవీ మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.

టీజర్ కు పాజిటివ్ టాక్ రావటంతో పాటు.. ఈ మూవీ మీద కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా తమ మూవీ ఉంటుందని చెబుతున్నారు. 90 శాతం వాస్తవాలతో 10 శాతం కల్పితంతో ఈ మూవీని చేసినట్లు చెబుతున్నారు. కొత్త దర్శకుడైనప్పటికీ ఖర్చు విషయంలో వెనుకాడకుండా తీసిన ఈ మూవీ టీజర్ విడుదల సందర్భంగా హీరో నిఖిల్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్ సెంటర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అమిత్ షాను కలిసే ఆహ్వానం వస్తే.. ఆ వెంటనే రెక్కలు కట్టుకొని వాలే పరిస్థితి. అందుకు భిన్నంగా అమిత్ షాను కలిసే ఆహ్వానం తనకు వచ్చినా.. తాను వెళ్లలేదన్న మాట నిఖిల్ నోటి నుంచి రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాను చేస్తున్న సినిమాకు ముద్ర పడటం ఇష్టం లేకనే వెళ్లలేదని.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కల్యాణ్ రామ్ తీస్తున్న డెవిల్ స్టోరీ లైన్.. స్పై స్టోరీ లైన్ ఒక్కటి కాదని.. తమ రెండు సినిమాలు సుభాష్ చంద్రబోస్ కథాంశంగా తీస్తున్నప్పటికీ.. రెండింటికి పొంతన లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలపై నిఖిల్ మాట్లాడుతూ.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ‘జెండాలు.. ఎజెండాలు లేవు. నిజాయితీగా తీసిన సినిమా ఇది. నిజమైన రా ఏజెంట్ల మాదిరి మేం శిక్షణ తీసుకున్నాం. ఏ పార్టీకీ అనుకూలంగా ఈ సినిమా తీయలేదు. ఒక భారతీయుడిలా ఈ సినిమా చేస్తున్నా. క్రిష్ణుడి మీద భక్తి భావంతో కార్తికేయ ఒప్పుకున్నా. కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులకు స్పై మూవీని చూపిస్తాం’ అని పేర్కొన్నారు.

అమిత్ షా ఆహ్వానం అందినా.. వెళ్లలేదన్న అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పకుంటే బాగుండేదన్న మాట కొందరినోటి నుంచి వస్తే.. ఇంత దమ్ముగా మాట్లాడటం నిఖిల్ కు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతుందంటున్నారు మరికొందరు. కొత్త ఇమేజ్ రాకున్నా ఫర్లేదు.. కొత్త కష్టాలు ఎదురుకాకుంటే అదే పది వేలు.

This post was last modified on May 17, 2023 12:27 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

3 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

4 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

6 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

8 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago