టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక, నందమూరి కుటుంబం, నారా ఫ్యామిలీ కూడా నారా లోకేష్‌తో కలిసి పాదయాత్రలో అడుగులు కదిపింది. మొత్తంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పసుపు జెండా రెపరెపలాడగా.. తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్రలతో కదం తొక్కారు. అయితే.. ఈ పాదయాత్రపై తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సటైర్లు వేశారు.
లోకేష్ పాదయాత్ర నూరురోజు లైనా, వెయ్యి రోజులైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యానించారు. తండ్రి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడానికే ఈ యాత్ర చేపట్టారని విమర్శించారు. టీడీపీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేకపోయిందని విమర్శించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పాదయాత్ర వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదన్నారు.
ప్రొద్దుటూరుకు లోకేష్ పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. లోకేష్ పాదయాత్రతో తనకు వచ్చేనష్టం లేదని.. ‘‘అల్లుడిలా వస్తాడు వెళతాడు’’ అంటూ ఎమ్మెల్యే రాచమల్లు సటైర్లు వేశారు. ఇప్పటి వరకు పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో ఎవరైనా ఒక్కరైనా నాయకులు వచ్చి టీడీపీలో చేరారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎవరో ఒకరిని రోజూ తీసుకువచ్చి పాదయాత్ర సక్సెస్ అయిందని చూపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినా.. తాను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డు చెప్పనని.. అలా చేస్తే.. లేనిపోని మైలేజీ ఇచ్చిన వాడిని అవుతానని అన్నారు.
This post was last modified on May 16, 2023 10:59 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…