ఏపీ సీఎం జగన్‌కు ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఝలక్ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోసిన అక్కడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్‌కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనను డియర్ బ్రదర్
అని సంబోధించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం(మే 15) డీకే శివకుమార్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన మద్దతు దారులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ , ఆమె పెట్టిన ఫొటో రెండూకూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. సీఎం జగన్ వరుసకు ఆమెకు అన్నయ్య అవుతాడు. అయితే.. ఇటీవల కాలంలో రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు.. రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలకమైన కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. పలు విషయాల్లోనూ ఆమె జగన్ నిర్ణయాలపై విభేదిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా డీకేను అన్నయ్య
అని సంబోధించడం.. గమనార్హం.
ఇంతకీ షర్మిల ఏమన్నారంటే.. ప్రియమైన డీకే శివకుమార్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. అంతేకాదు, జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు కూడా! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మీకు మరింత ఆయుర్ధాయం ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలతో కర్ణాటక ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా
అని షర్మిల పేర్కొన్నారు.
This post was last modified on May 15, 2023 10:16 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…