సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లతో అప్పుడప్పుడూ ఆసక్తికర సంభాషణలు, సంవాదాల్లోకి దిగుతుంటాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ అభిమానులతో హరీష్ ఆత్మీయ సంభాషణలు, వారితో కొన్ని సందర్భాల్లో జరిగిన వాదనల గురించి తన ఫాలోవర్లకు బాగానే తెలుసు.
అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా ఆసక్తికర కామెంట్లు పెడుతూ నెటిజన్లతో చర్చలు, వాదనలు చేస్తుంటాడు హరీష్. తాజాగా ఆయన పెట్టిన ఒక చిన్న పొలిటికల్ కామెంట్ పెద్ద చర్చకు దారి తీసింది.
ఒక కాంగ్రెస్ నేత.. టీవీ ఛానెల్ చర్చలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ మీద మీకు ద్వేషం ఉంటుందేమో, నాకెందుకు ఉంటుంది. నేను పాకిస్థాన్‌ను ప్రేమిస్తా’’ అని కామెంట్ చేయగా.. ఈ వీడియో మీద హరీష్ స్పందిస్తూ.. ‘‘ఓహో’’ అని కామెంట్ చేశాడు. ఇది ఒక కాంగ్రెస్ అభిమాని అయిన నెటిజన్‌కు కోపం తెప్పించింది.
‘‘ప్రతి దేశంతో ప్రేమగా మెలగాలని దాని అర్థం హరీష్ గారు. మా నాయకుల మీద నిందలు వేయాలని ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు’’ అని హరీష్‌ను ట్యాగ్ చేసి కామెంట్ చేశాడు. దీనికి హరీష్ బదులిస్తూ.. ‘‘వద్దు సార్.. ఇంకా లాగకండి బాగోదు’’ అన్నాడు. ఐతే ఆ నెటిజన్ చర్చను కొనసాగిస్తూ.. ‘‘పూర్తి వీడియో పెట్టొచ్చు కదా.. కేవలం అదే బిట్టు ప్లే చేయడం ఏంటి.. మీ సినిమా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా’’ అన్నాడు. బదులుగా హరీష్.. ‘‘నేను ఓహో అన్నాను. అవునా అని అర్థం. మీరు మర్యాద దాకా వెళ్లారు. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇక పోతే తెలివి తేటలా? మీ దగ్గర వేస్ట్ చేసుకోను. మీకంత సీన్ లేదు’’ అని వెటకారం ఆడాడు.
తర్వాత ఆ నెటిజన్ బదులివ్వకుండా ఆగిపోయాడు. హరీష్ కామెంట్ చూసి అతను బీజేపీ ప్రో అంటూ అతణ్ని కొందరు తిడుతుంటే.. మరికొందరు అందులో తప్పేముందంటూ ఎదురు దాడి చేస్తున్నారు.
This post was last modified on May 15, 2023 4:24 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…