Political News

తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్..వాట్ నెక్స్ట్ ?

కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్ ను పెంచుతున్నట్లుంది. నేతలంతా మహా సంతోషంగా ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమంటే కర్నాటక ఎన్నికల్లో తెలంగాణా నేతలు కూడా ప్రచారం చేశారు. కర్నాటకలో తెలంగాణా జనాలుండే ప్రాంతాల్లో చాలామంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ప్రచారంచేశారు. కారణాలు ఏవైనా నువ్వానేనా అన్నట్లుగా బీజేపీతో జరిగిన పోరులో కాంగ్రెస్ మంచి విజయం సాధించింది. ఇక రెండో కారణం ఏమిటంటే కర్నాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణాలో కూడా రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు.

నిజానికి కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణాలో రిపీట్ అవుతాయని చెప్పేందుకు లేదు. ఎందుకంటే కర్నాటకలో ఇద్దరు అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంచి సయోధ్యతో ఎన్నికలను ఎదుర్కొన్నారు. వర్గాలుగా విడిపోయి టికెట్ల కోసం కొట్టుకోలేదు. టికెట్ల కేటాయింపు, ప్రచార బాధ్యతలతో పాటు ఎన్నికల ఖర్చులను కూడా చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడింది.

ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఫుల్లుగా అడ్వాంటేజ్ గా తీసుకున్నది. అయితే తెలంగాణాలో పరిస్ధితులు విరుద్ధంగా ఉన్నాయి. కేసీయార్ పాలనపైన ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పూర్తిస్ధాయిలో అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోతోంది. ఎందుకంటే పీసీసీ అద్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డంటే సీనియర్లలో చాలామంది మండిపోతున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లలో కొందరు ప్యారలల్ రాజకీయం చేస్తున్నారు.

రేవంత్ అవునంటే వాళ్ళు కాదంటున్నారు. రేపు అభ్యర్ధుల ఎంపికలో రేవంత్ ను అందరు కలిసి ఇబ్బంది పెట్టడం ఖాయం. రేవంత్ ఇబ్బందిపెట్టడంలో పార్టీ పరువుపోయినా పర్వాలేదన్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు వ్యవహరిస్తున్నారు. టికెట్ల దగ్గరే పంచాయితీలు మొదలైతే ఇక ప్రచారం, నిధుల పంపిణీలో ఇంకెంత గొడవలవుతాయో ఊహించుకోవచ్చు. తెలంగాణా జనాల్లో కేసీయార్ అంటే వ్యతిరేకతుంది. కాంగ్రెస్ అంటే అభిమానముంది. కాకపోతే పార్టీ మీద అభిమానం నేతల్లోనే లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ?

This post was last modified on May 15, 2023 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago