ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నివాసరం ఉంటున్న ఉండవల్లిలోని కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెం డ్మెంట్ 1944 చట్టం ప్రకారం సీఐడీ అధికారులు ఈ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ.. తాజాగా ఆదివారం ఉదయం నోటీసులు అంటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ అలజడి చెలరేగింది.
సీఐడీ అధికారుల వాదన ఇదీ..
చంద్రబాబు నివాసాన్ని అటాచ్(స్వాధీనం/జప్తు) చేసిన అధికారులు.. దీనికి కారణాలు పేర్కొన్నారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవ కలకు పాల్పడి.. దానికి బదులుగా కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్ క్విడ్ ప్రోకో(నాకది-నీకిది) కింద పొందారని అభియోగాలు మోపారు. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొన్నారు.
చంద్రబాబు, నారాయణలు తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు నమోదైనట్టు సీఐడీ అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని తాము( సీఐడీ) కోరినట్టు అధికారులు అంటించిన నోటీసులో పేర్కొన్నారు. తమ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అంగీకరించిందని, దీంతో చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ, ఈ విషయాన్ని ముందుగానే స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చినట్టు సీఐడీ అధికారులు నోటీసులో వివరించారు. దీనిపై టీడీపీ నాయకులు ఇంకా స్పందించలేదు.
This post was last modified on May 14, 2023 1:35 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…