ఏపీలో పుంజుకోవాలన్నా.. కనీసం.. ఉనికిని నిలబెట్టుకోవాలన్నా.. బీజేపీకి ముందున్న ఏకైక మార్గం.. పొత్తు లేనని అంటున్నారు పరిశీలకులు. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తమను కాపాడుతుందని.. ఏపీలో నూ తమను గట్టెక్కిస్తుందని ఆశలు పెట్టుకుని.. ఇలానే పొత్తుల విషయంలో భీష్మించుకుని కూర్చుంటే.. మొత్తానికే మోసం ఖాయమని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు.
ఢిల్లీ టు బెంగళూరు, ఢిల్లీ టు మైసూరు అంటూ.. 19 సార్లు ఆయన కేవలం 25 రోజుల్లో పర్యటించారు. అంతేకాదు.. 6 ప్రధాన రోడ్ షోలు చేశారు. వీటిలో రెండు ఏకంగా 8 గంటల పాటు సాగాయి. ఇక, 5 బహిరంగ సభల్లో 4 గంటల 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మొత్తంగా రాష్ట్ర ఎన్నికలను ఆయన తన అధీనంలో కి తీసుకున్నారు. తన ఇమేజ్‌తో పార్టీని గెలిపిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. అదేసయమంలో టిప్పు సుల్తాన్ రాజకీయాలు తీసుకువచ్చారు. హిజాబ్ సహా ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయడం ప్రస్తావించారు.
మొత్తంగా చూస్తే.. మోడీ ఇమేజ్ సహా ఆయన ప్రకటిత పథకాలు తమను విజయతీరాలవైపు తీసుకువెళ్తా యని అనుకున్నారు. కానీ, కన్నడిగులు మోడీని నమ్మలేదు. బీజేపీకి ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. ఈ ఫలితాల అనంతరం.. ఇక, ఇప్పుడు తేలిపోయిన విషయం ఒక్కటే ఒక్కటి .. మోడీతో బీజేపీ ఇమేజ్ పెరగేది లేదు. క్షేత్రస్థాయి బలం.. కార్యకర్తలు.. వ్యూహాలే పార్టీని ముందుకు నడిపిస్తాయనేది స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న లేదా.. అంతకన్నా ముందే వస్తాయని భావిస్తున్న ఏపీలో బీజేపీ ఏవిధంగా అడుగులు వేయాలనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తాము జనసేనతో తప్ప ఎవరితోనూ కలిసి నడిచేది లేదని చెప్పిన.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టంగ్ మార్చారు. జనసేన అధినేత చెప్పిన పొత్తుల విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తేనే.. పొత్తుల దిశగా పావులు కదిపితేనే.. బీజేపీ ఇమేజ్ ఏమైనా నిలబడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on May 14, 2023 12:07 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…