Political News

వైసీపీ నేతలు పవన్ ట్రాప్ లో పడిపోతున్నారా?

రాజకీయంలో మజిల్ గేమ్ ఒకప్పటి మాట. ఇపుడంతా మైండ్ గేమ్ తోనే లాభమన్న విషయాన్ని పార్టీలు.. పార్టీ అధినేతలు ఎప్పుడో గుర్తించారు. కండబలాన్ని చూపిస్తే.. ప్రజలు నిశ్శబ్దంగా ఓటుతో తమ తీర్పును చెప్పి పవర్ ను పీకి పారేస్తున్నారు. స్మార్టుగా మారి.. మైండ్ గేమ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించటాన్ని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు రాజకీయ నాయకులు పలువురు.. మజిల్ కంటే మైండ్ గేమ్ ఆడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని చూసినప్పుడు.. అధికార వైసీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాను పొత్తులతో వెళుతున్నట్లుగా చెప్పటం ద్వారా వైసీపీకి ఇరిటేట్ కలిగించటం వెనుక పెద్ద లెక్కనే ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినంతనే ఆయన ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ వారి నోటి నుంచి వచ్చే మాటేమిటి? రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవలేదు. ముందు నువ్వు గెలిచి చూపించు. తర్వాత మాట్లాడు అని. అంటే.. ఎమ్మెల్యేగా సైతం గెలిచే సీన్ పవన్ కు లేదన్న విషయాన్ని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నట్లు కదా?
మరి.. అలాంటప్పుడు పవన్ నోటి నుంచి వచ్చే పొత్తుల మాటకు ఆకాశం ఊడి మీద పడుతున్నట్లుగా ఆగమాగం అయిపోతే.. దమ్ముంటే ఒక్కడిగానే పోటీ చేయ్. ఎవరితో ఎందుకు కలుస్తావ్? పొత్తులు ఎందుకు? లాంటి ప్రశ్నలు సంధించటంలో అర్థం లేదు కదా? ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ముందు అధికారికంగా పొత్తు పెట్టుకోవటాన్ని ఎవరు తప్పు పట్టరు. అలాంటప్పుడు పొత్తు తప్పుగా మాట్లాడటంలో అర్థం లేదు. ఒకవేళ.. మాట్లాడితే.. అది భయంతో మాట్లాడినట్లు ఉంటుందే తప్పించి.. మరోలా ఉండదు.

తిరుగులేని అధిక్యత ఉన్నప్పుడు… సొంతంగా ఎమ్మెల్యే సీటును గెలుచుకోలేని ఒక పార్టీ అధినేత చేసిన పొత్తు ప్రకటనకు వైసీపీ పరివారం ఆగమాగమైపోతు.. మాట్లాడటం దేనికి నిదర్శనం? తన మాటలకు వైసీపీ నేతలు.. మాట్లాడుతున్నారంటే.. పవన్ బలాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా? తనబలం ఎంతన్నది వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ ఆధారంగా పవన్ తన వ్యూహాన్ని సెట్ చేస్తున్న వైనం చూస్తే.. వైసీపీ నేతలపై పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ పొత్తుపై మాట్లాడిన సందర్భాల్లో.. దానికి రియాక్టు కాకుండా మౌనంగా ఉండటానికి మించింది లేదన్న మాట వినిపిస్తోంది.

పవన్ చేసే పొత్తు ప్రకటనలపై మాట్లాడం ద్వారా వైసీపీ తన బలహీనతల్ని తాను బయటపెట్టుకున్నట్లు అవుతుందన్న చిన్న విషయాన్ని ఏపీ అధికారపక్షం వెంటనే గుర్తించాలని అంటున్నారు. తమ బలంగా మీద తమకు ధీమా ఉన్నప్పుడు.. పక్కనోడి నిర్ణయాలను తప్పు పట్టటం.. వేలెత్తి చూపించటంలో అర్థం లేదు. అదే సమయంలో పవన్ ను తిట్టేందుకు.. విమర్శించేందుకు అదే పనిగా ఉత్సాహాన్ని ప్రదర్శించే కొందరు బ్రాండెడ్ నేతల వల్ల పవన్ పార్టీకి కావల్సినంత మైలేజ్ వస్తోంది ప్రజల్లో. ఈ లాజిక్కును వైసీపీ వర్గాలు గుర్తిస్తాయంటారా?

This post was last modified on May 14, 2023 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

32 minutes ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago