Political News

వయసు 92.. అయితేనేం ఫైట్ చేసి మరీ గెలిచి చూపించారు

ఆయనకు 92 ఏళ్లు. డెబ్భై దాటితేనే.. తమ పని తాము చేసుకోలేకపోతున్నట్లుగా చెప్పే చాలామందికి భిన్నం ఈ కాంగ్రెస్ నేత. తొంభై దాటిన వేళ.. ఎన్నికల్లో పోటీనా? టికెట్ ఇవ్వటమా? అంటూ ఎగతాళి చేసినోళ్ల మీద కస్సుమనటమే కాదు.. టికెట్ ఇస్తే.. తన సత్తా ఏమిటో చేతల్లో చూపిస్తానని సవాలు విసిరి.. మరీ గెలిచి చూపించిన పెద్ద మనిషి సక్సెస్ స్టోరీ ిది.

92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప అలియాస్ అప్పాజీ.. మరోసారి ఎన్నికల్లో గెలిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరులో కాంగ్రెస్ విజయం గురించి అందరూ మాట్లాడుకుంటున్న వేళ.. లేటు వయసులోనూ చక్కటి మెజార్టీతో విజయం సాధించి.. తన వయసు చూసి ప్రశ్నలు వేసినోళ్ల నోళ్లు మూయించిన వైనం ఆసక్తికరంగా మారింది.

దావణగెరె రేసుగుర్రంగా పేరున్న అప్పాజీకి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు ససేమిరా అన్న పరిస్థితి. ఇలాంటి వేళ.. వారిని ప్రశ్నించి మరీ సీటు తెచ్చుకున్నారు. తానో రేసుగుర్రాన్నని.. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తానని సవాలు విసరటమే కాదు.. అందుకు తగ్గట్లే28వేల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

కాస్తంత ఆలస్యంగా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసిన అప్పాజీ తొలిసారి 1994లో దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో మాత్రం ఓటమి పాలయ్యారు. తిరిగి 2004లో పోటీ చేసి గెలిచిన ఆయన.. 2008 నుంచి దావణగెరె సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, ఇలా వరుస ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆయన వయసు చూపించి.. టికెట్ ఇవ్వటమా? అని ప్రశ్నించారు. దీనికి బదులుగా ఆయన పోరాడి మరీ టికెట్ సొంతం చేసుకొని ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.

కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా అప్పాజీని చెబుతారు. పెద్ద వయస్కుడైన అభ్యర్థిగా రికార్డు సాధించిన ఆయన.. దావణగెరె సౌత్ నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఆయనకు 84,298 ఓట్లు రాగా.. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి 56,410 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఈ ఎన్నికల్లో అప్పాజీ ఓటమి ఖాయమనుకున్నారు. కారణం.. బీజేపీ అభ్యర్థికి ముస్లింలకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లింలు.. ఆయనకే ఓటు వేస్తారని భావించారు. అందుకు భిన్నంగా తన సత్తా ఏమిటో ఎన్నికల ఫలితంతో నిరూపించుకున్నారు. ఏమైనా.. 92 ఏళ్ల లేటు వయసులో ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదని మాత్రం చెప్పక తప్పదు.

This post was last modified on May 14, 2023 11:23 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

1 hour ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

2 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

3 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

4 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

8 hours ago