ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సీఎం జగన్ ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 2వ తారీకు తీసుకువచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోలను కట్టడి చేసేలా ఈ జీవో ను జారీ చేశారు. దీనిపై పద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీ, జనసేనల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం కూడా ఎదురైంది. అయినా.. సర్కారు వెనక్కి తగ్గలేదు.
దీంతో ఈ జీవోను సవాల్ చేస్తూ టీడీపీ, వామపక్షాలు సహా ప్రజాసంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం తాజాగా శుక్రవారం తీర్పు వెల్లడించింది. విచారణ సందర్భంగా.. “రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో జారీ చేశారు” అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
జీవో మంటలు..
రహదారులపై బహిరంగ సమావేశాలు, ముఖ్యంగా రోడ్ షోలు.. నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.
పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం ‘కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి’ అని ఈ సెక్షన్ చెబుతోందన్నారు. జీవో 1 దీనికి భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి’ అని చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను జీవో 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాలపై 2023 జనవరి 24న లోతైన విచారణ జరిపి తీర్పును నేటికి రిజర్వు చేసి.. జీవో నెంబర్1ను కొట్టివేసింది.
అయితే.. దీనిపై విచారణ ఎప్పుడో పూర్తయినా.. తీర్పు ఇవ్వలేదని పేర్కొంటూ..కొల్లు రవీంద్ర ఇటీవల సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంది. అదేసమయంలో మే 30లోగా తీర్పు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలావుంటే.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. 1835 నాటి బ్రిటీష్ చట్టాలను అనుసరించి జగన్ సర్కారు ఈ జీవోను తీసుకురావడం గమనార్హం.
This post was last modified on May 12, 2023 10:45 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…