తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందివచ్చిన పార్టీలతో కలిసి.. హస్తినలో అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. దీనికిగాను ప్రధానంగా.. కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ను తనకు మిత్రపక్షంగా చేసుకుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కార్యక్రమాలు జరిగినా.. జేడీఎస్ కీలక నాయకుడు.. కుమారస్వామిని అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్.
అలా.. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామి.. ఇప్పుడు బీఆర్ఎస్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారనే చర్చ రాజకీయంగా ప్రాదాన్యం సంతరించుకుంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఒక పార్టీ.. ముఖ్యంగా ఒక కీలక నాయకుడు(పేరు చెప్పలేదు) పార్టీకి ఆర్థికంగా.. భౌతికంగా(ప్రచారం) కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ, ఆయన హామీని నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. అంటే.. కుమారకు అండగా ఉన్నది ఎవరు అంటే.. కేసీఆర్ మాత్రమే.
పరిస్థితులను గమనిస్తే.. కర్ణాటక ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున కూడా ప్రచారం చేస్తామని.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజున బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ప్రకటన వచ్చింది. కానీ నెల రోజులు సాగిన ప్రచారంలో ఎక్కడా బీఆర్ఎస్ ఊసు కర్ణాటకలో కనిపించలేదు. పైగా.. కుమారస్వామికి.. ఎక్కడా ఆర్థికంగా కూడా సాయం అందలేదన్నది.. ఆయన చెప్పిన మాటలను బట్టి తెలిసింది. ఈ నేపథ్యంలో రేపు హంగ్ వచ్చి.. కుమారస్వామికి ప్రాధాన్యం పెరిగితే.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
తద్వారా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మరి అప్పుడు బీఆర్ఎస్‌కు ఆయన ఏమేరకు సాయం చేస్తారు? ఎందుకు చేయాలి? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. రేపు హంగ్ వస్తే.. బీజేపీ లేదా.. కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశంఉంటుంది. ఇదే జరిగితే.. బీఆర్ ఎస్‌కు పూర్తిగా కుమార దూరం ఖాయం. బహుశ ఇది గమనించే కేసీఆర్ దూరంగా ఉన్నారా? అనేది మరో ప్రశ్న. ఎలా చూసుకున్నా.. బీఆర్ ఎస్‌లో కుమారసంభవం.. సాధ్యం కాదనేవాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on May 12, 2023 10:54 am
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…