గడిచిన పదిహేనేళ్లుగా హైదరాబాద్ డెవలప్ మొంట్ ను చూస్తే.. నగరం మొత్తం ఒక పక్కకు ఒరిగిపోతున్నట్లుగా అనిపించక మానదు. నగరం డెవలప్ అవుతున్నా.. ఎక్కువ మాత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా సాగుతున్నట్లుగా చెప్పాలి. ఐటీ కంపెనీల రాకతో పాటు.. పలు ప్రాజెక్టులు పైప్ లైన్ తో ఉండటంతో.. మిగిలిన మహానగరానికి పశ్చిమభాగం ఒక మణిపూసలా మారింది.
ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే.. నగరానికి ఇబ్బందే. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లుక్ ఈస్ట్ అంటూ.. ఉప్పల్ ప్రాంతం వైపునఐటీ ప్రాజెక్టులు వచ్చేలా ప్లాన్ చేయటం తెలిసిందే. అయితే.. ఆశించినంతగా ఐటీ కంపెనీలు రాలేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దాని ప్రకారం ఐటీ కారిడార్ ఉండే పశ్చిమ ప్రాంతం తప్పించి.. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఐటీ కంపెనీల్నినెలకొల్పితే భారీ ఎత్తున ప్రోత్సాహాకాలు ఇవ్వాలని భావిస్తోంది.
ఇందుకోసం కొత్త పాలసీని ఏర్పాటు చేయనుంది. ఉత్తరాన కొంపల్లి.. దాని పరిసర ప్రాంతాలు.. తూర్పున ఉప్పల్.. పోచారం.. దక్షిణాన శంషాబాద్.. ఆదిభట్ల.. కొల్లూరు.. ఉస్మాన్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సహాకాలు ఉంటాయని చెబుతోంది. దీంతో.. నగరం నలుమూలల ఐటీ పరిశ్రమలు వస్తే.. హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ గ్రిడ్ ఏర్పడటమే కాదు.. పశ్చిమ ప్రాంతంపైన భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలా అని.. ప్రభుత్వం చెప్పిన ప్రాంతాల్లో ఐటీ కంపెనీల్ని నెలకొల్పితే.. విద్యుత్ తో పాటు..అద్దె తదితర అంశాల్లో ప్రోత్సహాకాలు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు సాగితే.. రానున్న ఐదారేళ్లలో చాలానే మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.
ప్రభుత్వం చెప్పినట్లుగా కంపెనీలు ప్రోత్సాహాకాలు సొంతం చేసుకోవాలంటే.. ఐదేళ్లలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాజాగా తామిచ్చిన ఆఫర్ తో రానున్న ఐదేళ్లలో 100 ఎకరాల మేర పారిశ్రామికవాడలు.. ఐటీ పార్కులుగా మారే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు మాదాపూర్.. కొండాపూర్.. హైటెక్ సిటీ మాదిరి తయారవుతాయని చెప్పక తప్పదు.
This post was last modified on August 6, 2020 11:19 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…