కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన నేతలా టీడీపీకి ఏమాత్రం కష్టం లేకుండా ఎదురొచ్చి జాయిన్ అయ్యారు సీనియర్ కాపు లీడర్ కన్నా లక్ష్మీనారాయణ. కానీ, ఆయన్ను చంద్రబాబు ఎంతవరకు వాడుకోగలుగుతున్నారు? కన్నా స్టామినాను, ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను, వ్యూహాలను చంద్రబాబు ఎందుకు వాడుకోలేకపోతున్నారు.. కన్నాను పార్టీలో ఎందుకు యాక్టివ్ చేయడం లేదు.. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా ఎందుకు ఖాళీగా కూర్చోబెడుతున్నారు? గుంటూరు నేతలనే కాదు.. గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న కన్నా ఫాలోవర్లు, కాపు నేతలను ఇప్పుడు ఇదే కలవరపెడుతోంది.
కన్నా టీడీపీలో చేరి రెండు నెలలు దాటింది. పార్టీలో చేరిన ప్రారంభంలో కొంచెం ఆయన స్పీడుగా కనిపించినప్పటికీ కొద్దివారాలుగా ఆయన మౌనంగా ఉన్నారు. పార్టీలో చేరగానే పాత గుంటూరు జిల్లా మొత్తం ఒక రౌండ్ పర్యటించిన కన్నా ఆ తరువాత కామ్ అయిపోయారు. రాష్ట్ర స్థాయిలో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్న కన్నాకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మరింత పట్టుంది.
పెద్దకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ వంటి నియోజకవర్గాలలో ఎన్నికలలో ఫలితాలను మార్చగల సత్తా కన్నా సొంతం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్ట్రాంగ్ లీడర్. అలాంటి కన్నాకు టీడీపీలో ఇంతవరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన నియోజకవర్గాలలో తిరిగేందుకు వెనుకాడుతున్నట్లు చెప్తున్నారు. అసలే.. వేరే పార్టీలోకి రావడం, పదవి లేకుండా తిరిగితే ఆల్రెడీ పార్టీలో ఉన్న నాయకులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కన్నా కాస్త ఆగుతున్నట్లు చెప్తున్నారు. పార్టీ పరంగా సరైన పదవి లేకుండా అలా నియోజకవర్గాలు చుట్టబెట్టడంతో మొదలుపెడితే సమస్యలొస్తాయని.. కాబట్టి తన స్థాయికి తగ్గ పదవి ఏదైనా ఇస్తే పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఉపయోగపడాలని కన్నా ఆలోచిస్తున్నారట.
నిజానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. సత్తెనపల్లిలో కోడెల శివరాం పార్టీపై కారాలుమిరియాలు నూరుతున్నారు. కన్నాను పార్టీలోకి తేవడంతో ఆయన ఉక్కబోత ఫీలవుతున్నారు. తన సీటుకు ఎసరు పెడతారని ఆయన ఆందోళన చెందుతున్నారు. వైవీ ఆంజనేయులదీ అదే పరిస్థితి. ఇది చాలదన్నట్లు తాటికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌కు పోటీదారులు పెద్దసంఖ్యలో తయారయ్యారు. పొన్నూరులో కాపుల ఓట్లను టీడీపీ వైపు తేవడంలో ఇప్పుడున్న నేతలు సక్సెస్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు కన్నాను కనుక రంగంలో దించితే చాలావరకు ఇలాంటి సమస్యలను ఆయన చాకచక్యంగా సెట్ చేయగలరని.. ఆయన గతంలో కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసినప్పటికీ పార్టీలకతీతంగా ఆయనకు వెయిట్ ఉండడం, టీడీపీలోనూ ఆయనకు యాక్సెప్టెన్స్ ఉండడంతో నియోజకవర్గాలలో పార్టీని సెట్ చేయగలరని భావిస్తున్నారు. కానీ, చంద్రబాబు ఇంతవరకు ఏమీ నిర్ణయించకపోవడంతో నష్టం జరుగుతోందని ఆయన అనుచరులు అంటున్నారు.
కన్నాకు రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తే ఆయన వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడగలరని.. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే బీజేపీ అంతోఇంతో జనంలో ఉందని.. ఇప్పడు టీడీపీలో రాష్ట్ర స్థాయి పదవి కనుక ఇస్తే ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని నిత్యం డిఫెన్స్‌లోకి నెట్టేలా ఫైట్ చేయగలరని అంటున్నారు. మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 11, 2023 4:35 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…