నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. గత 2014, 2019 ఎన్నికల్లో కూడా.. ఇక్కడి ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారు. 2019లో అయితే.. క్లీన్ స్వీప్ చేసేసింది. మరి అలాంటి జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత లేకపోగా.. ప్రజలను పట్టించుకునే తీరిక కూడా నాయకులకు ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయినప్ప టికీ.. నాయకులు మాత్రం జగన్ భజనలోనే సేదదీరుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా.. సొంత పార్టీ నాయకుల నుంచే కావడం గమనార్హం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదంటూ.కొన్ని రోజుల కిందట.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాహాటంగా విమర్శించడం.. తర్వాత కాలంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయడం తెలిసిందే. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. అయినప్పటికీ.. ఆయన తన ప్రజాగళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇక, కోటంరెడ్డికి మద్దతుగా ప్రజలు కూడా ఇటీవల ఆయనకు బ్యానర్లు కట్టారు.
దీంతో కోటంరెడ్డి హవా పెరుగుతోందని భావిస్తున్నారో.. ఏమో.. తెలియదు కానీ, వైసీపీ అదిష్టానం మళ్లీ.. ఇక్కడ కాకరేపేలా వ్యవహరిస్తోందని.. వైసీపీలోని తటస్థ నాయకులు చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ నాయకుడు.. అనిల్ కుమార్.. కోటంరెడ్డిపై నిప్పులు చెరిగారు. అదేసమయంలో జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
“ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే పక్కపార్టీలకి పోతారు. స్కూళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ది వారికి కనిపించదు. జగన్ పుణ్యమాని అన్ని విధాల లక్షణంగా ఉన్నామని మరిచిపోతే ఎలా? జగన్ ఏమీ చేయలేదు… ఏమీ చేయలేదు… అనడం సరికాదు. నాకూ చాలా చేయాలని ఉంటాయి. మన ఒక్క నియోజకవర్గమే కాదు కదా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మాదిరిగా రోడ్లుపై రోడ్లు వేసి నిధులు దుబారా చేయలేదు.” అని వ్యాఖ్యానించారు.
దీనిపై కోటం రెడ్డి వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. 175 నియోజకవర్గాల ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కదా! 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓటేశారు కదా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం అంటే.. కొన్నినియోజకవర్గాలకేనా ? అని నిలదీస్తున్నారు. దీంతో నెల్లూరులో మరోసారి రాజకీయ మంటలు రగులుకున్నాయనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on May 11, 2023 1:55 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…