గత రెండు నెలలుగా ఊరూ వాడా హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పోటెత్తి ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 70 శాతం ఓట్లు పోలయ్యాయి. గత 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇది దాదాపు 8 శాతం ఎక్కువగా ఉంది. దీనిని బట్టి.. ఈ సారి ప్రజల్లో చైతన్యం కొంత మేరకు కనిపించింది.
అయితే.. ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం.. ప్రజల్లో ఏపార్టీపైనా పూర్తి విశ్వాసం కనిపించడం లేదనే! నిజానికి మోడీ నుంచి సోనియాగాంధీ వరకు హేమా హేమీలు ఇక్కడ ప్రచారం చేశారు. పెద్ద పెద్ద నాయకులు.. పెద్ద పెద్ద విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఉగ్రవాదం.. నుంచి హనుమాన్ వరకు.. ఉచితాల నుంచి రాష్ట్ర సెంటిమెంటు వరకు అనేక అంశాలు రాజకీయంగా.. ఊపేశాయి.
అయినా కూడా.. ప్రజల నుంచి మిశ్రమ స్పందనే కనిపించింది. ప్రజలు చాలా నేర్పుగా.. తమ సత్తా చూపించారనే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వెల్లడైన.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే.. బీజేపికి కానీ.. కాంగ్రెస్‌కు కానీ.. గుండుగుత్తగా.. ప్రజలు మెజారిటీని కట్టబెట్టలేదు. అంతేకాదు.. ఏపార్టీకి కూడా.. పూర్తిగా అధికారం అప్పగించలేదు. అంటే.. ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా.. పూర్తిగా దక్కించుకోలేక పోయిందని అనేకన్నా.. పార్టీలకు.. ప్రజలే.. తగిన విధంగా సమాధానం చెప్పారా? అని మేధావులు అంటున్నారు.
నిజానికి ఇప్పుడు కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నది.. బీజేపీ చెబుతున్న భజరంగ బలిని కానీ, కాంగ్రెస్ చెబుతున్న నిషేధాలు కానీ కాదు. సాగు తాగునీటికి అల్లాడుతున్న అనేక జిల్లాల్లో ప్రజలు ఉపాధి కోల్పోయారు. అక్కడ భారీ ఎత్తున అధికార పార్టీకి ఇప్పుడు గండి పడిందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీనిని బట్టి.. ప్రజలు కోరుకుంటున్నది.. సరైన పాలనే తప్ప.. పార్టీల మేనిఫెస్టోను కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా చూసుకున్నా.. కర్ణాటక ప్రజలు ఏపార్టీ కి మొగ్గు చూపకుండా.. మళ్లీ హంగ్ వైపు మొగ్గడం.. సర్వత్రా చర్చకు దారితీసింది.
This post was last modified on May 11, 2023 11:42 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…