కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది.
ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి కొందరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు(వీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా కప్పాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
దీనికితోడు వివేకా హత్య నుంచి తమకు అనుకూల ఓటు బ్యాంకు వస్తుందని.. తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నికల సమయంలో ఉన్న లెక్కలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా ఇక్కడి పరిస్తితి ఉంది. ఇదేసమయంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో కీలక వ్యక్తులు తటస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రజల నుంచి రాజకీయంగా ఎదురవుతున్న కొన్ని పరిణామాల నుంచి కూడా వారు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో కడపలో ఈ సారి తమ పట్టు కోల్పోకుండా.. జాగ్రత్తలు తీసుకునే పనినివైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
This post was last modified on July 7, 2023 6:32 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…