Political News

నాందేడ్? ఔరంగాబాద్? కేసీఆర్ పోటీ ఎక్కడి నుంచి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలో పోటీ చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మహారాష్ట్రపై బాగా ఫోకస్ పెట్టడం, ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించడం, వాటిలో కేసీఆర్ పాల్గొనడం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫోకస్ ఆ రాష్ట్రంపై ఉన్న స్పష్టమవుతోంది. అయితే.. తాజాగా కేసీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.

ఇందుకోసం రెండు లోక్ సభ సీట్లు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. నాందేడ్, ఔరంగాబాద్‌లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయొచ్చని చెప్తున్నారు. నాందేడ్ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని గతంలో వినిపించినప్పటికీ ఇప్పుడు తాజాగా కేసీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. బీబీ పాటిల్ నాందేడ్‌లో మకాం వేసి బీఆర్ఎస్‌కు అనుకూలంగా నియోజకవర్గాన్ని మార్చగలిగితే కేసీఆరే రంగంలోకి దిగుతారని చెప్తున్నారు.

నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంత నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటుండడంతో పాటు అక్కడి ప్రాంతాల కోసం, నేతల కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. నాందేడ్, ఔరంగాబాద్.. రెండు నియోజకవర్గాలూ తెలంగాణకు పొరుగునే ఉణ్నాయి. ఈ నియోజకవర్గాలలో గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలను వందల సంఖ్యలో బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే పనిలో బీఆర్ఎస్ వర్గాలున్నాయి. ముందుముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు నాందేడ్‌తో పాటు ఔరంగాబాద్ స్థానం సైతం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఔరంగాబాద్ ఎంపీగా ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. ఇక్కడ ముస్లింలు పెద్దసంఖ్యలో ఉండడం.. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో మజ్లిస్‌కు తెలంగాణలో సీట్లు పెంచి ఔరంగాబాద్ లో కేసీఆర్ పోటీ చేసే ఆలోచన ఒకటి ఉన్నట్లు చెప్తున్నారు.

ఇక నాందేడ్ విషయానికొస్తే అక్కడ ప్రస్తుతం బీజేపీ నేత ప్రతాప్ రావు చికలికర్ ఎంపీగా ఉన్నారు. అయితే.. అదేమీ బీజేపీ కంచుకోట కోదు. 2009, 2019లో మాత్రమే ఇక్కడ బీజేపీ గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. కానీ, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనంగా ఉండడం… బీజేపీకి ఇది కంచుకోట ఏమీ కాకపోవడంతో నాందేడ్‌ను సులభంగా తమవైపు తిప్పుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆ బాధ్యతలను ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలకు అప్పగించారట.

మరి.. కేసీఆర్ అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయి.. లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఎంత బలపడుతుంది.. నాందేడ్, ఔరంగాబాద్‌లు కేసీఆర్ పోటీకి పూర్తిగా అనుకూలంగా మారుతాయా అనే దాన్ని బట్టి ఆయన పోటీ ఉంటుంది.

This post was last modified on May 12, 2023 7:29 am

Share
Show comments
Published by
Satya
Tags: KCRNanded

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

45 mins ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

1 hour ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

2 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

3 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

3 hours ago