ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వర్గాల వారీగా ఓటు బ్యాంకు చీలుతున్న పరిస్థితి కనిపి స్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. బెంగళూరు, మైసూరు, హుబ్బళి వంటి ఐటీ, పారిశ్రామిక నగరాల్లో ఓటు విభజన తెరమీదికి వచ్చింది. పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్నా.. వ్యాపార, ఐటీ వర్గాలు.. మొత్తంగా బీజేపీకి జై కొడుతున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత ఉన్న అంబానీ వంటివారు.. తమ కనుసన్నల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నారు.
పైకి ప్రధాన వ్యాపార వేత్తలు ఎవరూ కూడా తెరమీదికి కనిపించడం లేదు. కానీ, లోపాయికారీగా జరగాల్సిన రాజకీయాలు కర్ణాటకలో జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో మంచి పలుకుబడి.. తెల్లారి లేస్తే.. పారిశ్రామిక వర్గాలతో వ్యాపార సంబంధాలు ఉన్న వారిలో ముఖేష్ అంబానీ.. అదానీ వంటివారిని కొట్టిపారేయలేం. వారికి .. కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. కర్ణాటకలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అన్నీ కూడా.. లోపాయికారీగా బీజేపీకి సపోర్టు చేయడం ఖాయమని చెబుతున్నాయి. ఈ ఓటు బ్యాంకు కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. ఐటీ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు.. వారి కుటుంబాలపైనా.. పారిశ్రామికంగా చూసినా.. లక్షల సంఖ్యలో ఓట్లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోందని కర్ణాటక వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలోనూ ఇదే తరహా రాజకీయం తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే జరిగితే.. ఇప్పుడు న్న అంచనాల ప్రకారం.. బీజేపీ మాటనే ఆయా వర్గాలు వింటాయి. ఏపీలో ముఖేష్ అంబానీ అయినా.. అదానీ అయినా.. జగన్‌కు అనుకూలంగా ఉన్నారు. అదేసమయంలో కేంద్రంలోనూ.. బీజేపీకి సానుకూలంగా ఉన్నారు. భారీ ఎత్తున లబ్ధి కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ వర్గాలు.. ఐటీ, పారిశ్రామికంగా జగన్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఉంటుందని.. చెబుతున్నారు. అయితే.. ఇక్కడ ప్రత్యక్షంగా ఐటీ, పారిశ్రామిక వర్గాలను ప్రభావితం చేయకపోయినా.. పరోక్షంగా గెలిపించే అవకాశం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 12, 2023 7:29 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…