ఏపీలో రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు.. సర్వత్రా వినిపిస్తున్న మాట. ఎవరిని కదిపి నా.. ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించే ఉద్దేశం లేకుండా.. తన దారిలో తను వ్యవహరిస్తోంది. ఇప్పటికి నాలుగేళ్లు అయిపోయినా.. అమరావతిఊసు లేదు. కనీసం.. ఇక్కడి రైతుల ఉద్యమానికి కూడా వైసీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక, దీంతో ‘చంద్రబాబు వస్తే..’ రాజధాని బాగుపడుతుందని అనుకునే వారు పెరుగుతున్నారు.
ఇది సహజమే. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఏదో చేయాలని తపిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇదే.. ఇప్పుడు వైసీపీకి ప్రాణసంకటంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజన్‌ను అజెండాగా పెట్టుకుని… అమరావతిని అభివృద్ధి చేస్తే.. అది తమకు ఎన్నికల్లో పెద్ద ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ట్టు వైసీపీపై టీడీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రాజధానిని ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా.. అంటే..ఎలాంటి అభివృద్ధి లేకపోయినా.. ఉన్నది ఉన్నట్టు ఉంటే.. రేపు చంద్రబాబు వస్తే.. డెవలప్ చేస్తారు.
కానీ, ఈ అవకాశం కూడా లేకుండా.. మొత్తానికి కూకటి వేళ్లతో సహా అమరావతిని పెకలించి వేసే ఉద్దేశం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కొటిగా ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని భావిస్తోందని చెబుతున్నారు. తాజాగా ఆర్5 జోన్‌లో పేదలకు 1200 ఎకరాల భూమిని జగనన్న ఇళ్లకు కేటాయించేసింది. ఇది చాలదని గుంటూరు జిల్లా కలెక్టర్ ఇండెంట్ పెట్టడంతో ఆర్3 జోన్(ఇది రాజధానికి అత్యంత కీలకం) లో మరో 300 ఎకరాలను గుర్తించి రాత్రికి రాత్రికి ఇచ్చేశారు.
రెండు జిల్లాల కలెక్టర్లు అడిగిన భూమికి అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ లేఖ రాశారు. గతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదలకు 1134.58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు జిల్లాలలో లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా… ఎస్3 జోన్‌లో అదనంగా 268 ఎకరాలు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా అమరావతి రూపు రేఖలు సర్వనాశనం అయిపోతున్నాయనేది టీడీపీ వాదన. అంటే..రేపు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా.. దీనిని సరిచేసి.. తిరిగి అమరావతిని గాడలో పెట్టే అవకాశం లేకుండా.. చేస్తున్నారనేది టీడీపీ నేతల వాదనగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 10, 2023 11:55 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…