తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్‌కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా ఈ నెలాఖరుకు జరగబోయే మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేయనున్నారు. ఇంతకుముందు జరిగిన మహానాడులో కూడా ఇలాంటి తీర్మానాలే చేశారు.. కానీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాటలు చెప్పడమే కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపలేదంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి కూడా గతంలో ఇలాంటి ఆరోపణే చేశారు.
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో నిర్వహించిన మహానాడులోనూ ఈ తీర్మానం చేసినా.. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని ఆమె అప్పట్లో ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని…. ఆయన ప్రధానితో భేటీ అయిన సందర్భంలోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న కోరికను వెలిబుచ్చారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి.
మరోవైపు.. దీనిపై ఇంకో విమర్శా ఉంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదనే వారు కూడా ఉన్నారు. అందుకు కారణం కూడా చెప్తుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారత రత్న వస్తే దాన్ని ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తప్ప ఇంకెవరూ ఆ అవార్డు స్వీకరించే అవకాశమే లేదు. అది ఇష్టం లేకే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని.. చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం వల్లే అవార్డు రాలేదని టీడీపీ నేతల నుంచీ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.
This post was last modified on May 10, 2023 6:26 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…