ఒక అంశం మీద పోరాడుతున్నప్పుడు ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలంటే.. వ్యూహం పక్కాగా ఉండాలి. మాటలు గంభీరంగా ఉండి.. చేతలు చులకన చేసేలా ఉంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. తాజాగా ఏపీ విపక్ష నేత కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఇదే రీతిలో ఉంది. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల అంశంపై ఏపీ సర్కారు దూకుడుగా దూసుకెళుతున్న వైనం తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చి తాత్కాలిక స్పీడ్ బ్రేకులు వేసింది.
మూడు రాజధానుల నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. జగన్ సర్కారు మీద నిప్పులు చెరగటం.. 48 గంటలు టైమివ్వటం తెలిసిందే. ఈ మాటలు చెప్పి 24 గంటలు గడవక ముందే..మరోసారి మీడియా భేటీ ఏర్పాటు చేసిన ఆయన.. కొత్త పాటను ఎత్తుకున్నారు. అమరావతి అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని వీడియోల రూపంలో ప్రదర్శించిన ఆయన మాట తప్పినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం జరుగుతోందన్న మాట బాబు నోటి నుంచి రావటం గమనార్హం. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలన్న ఆయన.. రాజధానికి 30వేల ఎకరాలు కావాలని జగన్ అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. తాను చెప్పిన విషయాల్ని మరిచి మూడుముక్కలాటను మొదలు పెట్టారన్నారు. వారి చేతికి అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికలకు ముందే చెప్పారన్నారు. వేలాది మంది అమరావతి కోసం రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారని చెప్పారు.
మూడు రాజధానుల మీద జగన్ సర్కారు తీరుపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామాలు చేస్తారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తానంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేనన్న విషయాన్ని ఆయన తన తాజా వ్యాఖ్యలతో మరోసారి నిరూపించారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని.. ప్రజల్ని మోసం చేయటం తప్పు అంటూ హితవు పలికారు.
ఏపీ ఏకైక రాజధాని అమరావతిగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తే.. తాము తమ పదవుల్ని వదిలేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం. రాజకీయాల్లో నమ్మిన దాని కోసం దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. తడవకోసారి మాటలు చెప్పకూడదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి తెలుసుకుంటారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. ఆయన తన రాజీనామాను ప్రకటిస్తారని భావించారు. అందుకు భిన్నంగా ఆయన మాటలు యూటర్న్ తీసుకున్నట్లుగా ఉండటం గమనార్హం.
This post was last modified on August 5, 2020 11:14 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…