హైదరాబాద్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. వాళ్లు భారీ దాడికి ప్లాన్ చేసే లోపే భద్రతా దళాలు అలెర్ట్ కావడంతో సామూహిక జనహననాన్ని నివారించగలిగారు.
తెలంగాణ రాజధానిలో మారణహోమం సృష్టించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారు. ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఆ సంగతి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఉమ్మడి దాడుల్లో మొత్తం 16 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అందులో 11 మంది మధ్యప్రదేశ్ వారు. హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది..
భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సాహిత్యం కూడా స్వాధీనమైందని చెబుతున్నారు. అసలు వారి ప్రధాన లక్ష్యం ఎవరు, వారి ప్లాన్ ఏమిటి తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని భద్రతా దళాలు అంటున్నాయి.
ఉగ్రవాదులందరినీ అరెస్టు చేశామని చెప్పలేని పరిస్థితుల్లో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. రోడ్లపైన అనుమానిత వస్తువులు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు..
This post was last modified on May 9, 2023 12:51 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…