ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం తపిస్తున్న యువ నేతలు.. వైసీపీ కంటే కూడా.. టీడీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో గుండుగుత్తగా చంద్రబాబు వారసు లకు టికెట్లు ప్రకటించారు. అయితే.. అనుకున్న విధంగా వారసులు గట్టెక్క లేక పోయారు. ఒక్క ఆదిరెడ్డి భవానీ తప్ప.. మిగిలిన వారసులు అంతా ఓటమి బాటపట్టారు. ఇప్పటికే వీరంతా 30+లలోకి వెళ్లిపోయారు. కనీసం ఇప్పుడైనా గెలుపు గుర్రం ఎక్కితే తప్ప.. 30 ఏళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారనే పేరు వస్తుంది.
లేకపోతే..మరో ఐదేళ్లు ఆగిపోవాలి. దీంతో యువ నేతలు.. ఇప్పుడుచంద్రబాబు కోసం.. ఆయన అనుగ్ర హం కోసం తపిస్తున్నారు. అయితే..వైసీపీ ఈ సారి.. సీనియర్లకే టికెట్లు ఇస్తుండడంతో గత ఎన్నికలలో చేసిన ప్రయోగాలు వికటించిన దరిమిలా.. చంద్రబాబు వారసులకు టికెట్లు ఇచ్చే విషయంపై అంతర్మ థనంలో పడ్డారనేది వాస్తవం. కానీ, వారసుల విషయం మాత్రం తరచుగా ఆయన చెవిలో పడుతూనే ఉంది.
తాజాగా పరిటాల సునీత మరోసారి చంద్రబాబును హైదరాబాద్‌లో కలవడం.. ప్రాధాన్యం సంతరించు కుంది. అదేవిధంగా జేసీ బ్రదర్స్ కూడా.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులనే మరోసారి నిలబెడతామని.. చంద్రబాబుకు తేల్చి చెప్పారు. అదేవిధంగా రాజాం నుంచి గ్రీష్మ.. శ్రీకాకుళం లోని పలాస వంటి నియోజకవర్గాలపైనా.. సందిగ్ధత నెలకొంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వీరి గ్రాఫ్ ఎలా ఉందనేది ఇప్పుడు మరోసారిచంద్రబాబు పరిశీలనకు తీసుకున్నారు.
యువ నేతలజోరుతో సంబంధం లేకుండా.. ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెడుతున్న విషయం. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సీనియర్లను నిలబెడుతున్న విషయం తెలిసిందే. వారసులను కాదని..సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తోంది.దీనిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. వారసుల ఆశలు ఫలించేలా నిర్ణయం తీసుకుంటారా? లేక.. ఏం చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. వారసులు మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారనేది వాస్తవం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 11, 2023 9:52 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…