ఏపీలో చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్రిస్టియన్ ఓటు బ్యాంకు.. జగన్‌ను, వైసీపీని వెన్నంటుతూ వచ్చింది. 2014 కంటే కూడా.. 2019లో క్రిస్టియన్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్‌కు అనుకూ లంగా పడింది. దీనికి ప్రధాన కారణం.. జగన్ బావ, సువార్తీకుడు.. అనిల్ కుమార్.. ఆయా వర్గాలను ప్రేరే పించారు. జగన్‌కు అనుకూలంగా సభలు.. కూటములు పెట్టి.. వారిని వైసీపీకి అనుకూలంగా మలిచారనే ది నిష్టుర సత్యం.
అందుకే, గత ఎన్నికల్లో ఒకింత దూకుడు కనిపించింది. ఏకంగా 151 స్థానాలు తెచ్చుకోవడం వెనుక.. అని ల్ వ్యూహం పనిచేసింది. మొత్తం ఎస్సీ నియోజకవర్గాలు 24 ఉంటే.. 23 స్థానాల్లో వైసీపీ విజయం దక్కిం చుకోవడం వెనుక.. అనిల్ చక్రం బాగానే తిప్పారనేరాజకీయ విశ్లేషకులు చేసిన అంచనా. అయితే.. ఇప్పు డు అదే అనిల్ పొగపెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీలో పర్యటించకపోయినా.. ఆయన శిష్యులతో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న వాదన.
తన కుటుంబానికి జరిగిన అన్యాయం. ముఖ్యంగా జగన్ తన సోదరిని తరిమేయడం.. వంటివాటిని అనిల్ సీనియస్‌గా తీసుకున్నారట. అంతేకాదు.. ఆస్తి తగాదాల నేపథ్యం కూడా కలిసి వస్తోందని చెబుతున్నా రు. దీంతో ఆయన శిష్యులుగా ఉన్న కొందరు.. అంతర్గత చర్చలు.. సమావేశాల్లో వైసీపీకి వ్యతిరేకంగ ప్రచారం చేస్తున్నట్టు వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గత ఎన్నికలకు ముందు.. వైసీపీకి ఓటేయాలని చెప్పినవారే.. ఇప్పుడు వేయొద్దని చెబుతున్నారు.
అంతేకాదు.. ఆత్మ ప్రబోధాను సారం ఓటేయాలని.. పిలుపు ఇస్తున్నట్టు చెబుతున్నారని వైసీపీ నాయకు లు చెబుతున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైసీపీకి మాత్రంవద్దని చెబుతున్నారని అంటున్నారు. ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేకుండా సాగుతున్న ప్రచారం ఎలా ఉందంటే.. మనం గతంలో బలపరిచిన ఒక వ్యక్తి.. దారి మళ్లారు. దారి మళ్లిన వారిని దారిలో తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మన ఆత్మ ప్రబోధాను సారి ఈ సారి ముందుకు వెళ్దాం అని వారు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది పరోక్షంగా వైసీపీని ఉద్దేశించేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…