ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్‌వార్ మొదలయ్యింది.
శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పడరాని పాట్లు పడుతుండటం… నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటంటూ జొన్నలగడ్డ పద్మావతి మోకాలడ్డుతుండటమే కారణమంటూ జోరుగా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో చర్చసాగుతోందట. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి యల్లనూరు మండల పరిధిలోకి వస్తుంది. పక్క మండలం పుట్లూరు. ఈ రెండు మండలాల్లో ఆయనకు బలమైన అనుచరవర్గం వుంది. ఈ మండలాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అడ్డుతగులుతూ వ్యతిరేక వర్గాన్ని తన అనుచర వర్గంపైకి ఉసిగొల్సుతున్నారనే భావనలో పెద్దారెడ్డి వున్నారు. అసలు మన ప్రాంతంలో పెద్దారెడ్డి పెత్తనమేంటని పద్మావతి భర్త సాంబశివరావు ఆమెను రెచ్చగొడుతున్నారు.
పుండుమీద కారం చల్లినట్లుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి కొరకరాని కొయ్యలా తయారైన భోగాతి నారాయణరెడ్డికి శింగనమల ఎమ్మెల్యే రాజకీయంగా అండగా వుండటం కూడా మింగుడు పడటం లేదు. ఒకప్పుడు పుట్లూరు యల్లనూరు మండలాల్లో జేసీ వర్గాన్ని లీడ్ చేసిన భోగాతి నారాయణరెడ్గికి వైసీపీలోనూ పెద్దపీట వేస్తుండటంతో పెద్దారెడ్డి లోలోన మధనపడుతున్నారు. పైగా ఆయనకు భారీగా కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు. వైసీపీ అధికారంలో వున్నా తనకు అన్ని విధాలా అండదండగా వున్న పుట్లూరు , యల్లనూరు మండలాల్లోని అనుచరవర్గం ఇబ్బందులు పడుతుండటం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంపై సన్నిహితులతో కేతిరెడ్డి ఆవేదన చెందుతున్నారు.
పుట్లూరు మండలంలో పెద్దారెడ్డి కొనుగోలు చేసిన భూములను ఆన్ లైన్లోకి ఎక్కించకుండా ఎమ్మెల్యే పద్మావతి అడ్డుపడుతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్న మాట. ఇలాగైతే తాను అక్కడ ధర్నాలు చేయాల్సి వస్తుందని పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక యల్లనూరు మండలం దంతలపల్లిలో ఉపాధిహామీ పనుల విషయంలో పెద్దారెడ్డి , భోగాతి నారాయణరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్దారెడ్డి వర్గీయులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఒత్తిడితో భోగాతి నారాయణరెడ్డి వర్గీయులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట. ఈ కొట్లాట ఇంకెంత దూరం పోతుందోనని అనంతపురం వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు…
This post was last modified on May 12, 2023 2:36 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…