“అవును.. అప్పట్లో మమ్మల్ని మీరు తిట్టారు. మాకు ఇంకా గుర్తుంది. కానీ.. మీరేమన్నా.. మాపై కక్షతో తిట్టారా? కేవలం రాజకీయంగా చేసిన కామెంట్లు. వాటిని మేం పట్టించుకునేది లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇదంతా కేవలం రాజకీయాల్లో భాగం. మేం మనసులో పెట్టుకోలే దు. మీరు కూడా అంతే. డేటు టైము చెప్పండి. మా వాళ్లు వస్తారు. మీతో మాట్లాడతారు” ఇదీ.. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట.
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ రెండు పార్టీలు కూడా రాజకీయంగా బలం పుంజుకునే క్రమంలో అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. వీటిలో ప్రజలకు చేరువ కావడం ఒక వ్యూహం. దీనిని ఎలానూ చూస్తున్నాయి. వివిధ కార్యక్రమాల పేరుతో వైసీపీ, టీడీపీలు ప్రజలకు చేరువ అవుతున్నాయి. అయితే.. అదే సమయంలో ఎదుటి పార్టీల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ ఇంపార్టెంటేనని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఎదుటి పార్టీల్లో అసంతృప్తి గా ఉన్నవారికి గేలం విసురుతున్నాయి. ఇలాంటివారిలో గతంలో తమ పార్టీల్లో పనిచేసి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్తూ.. అప్పటి వరకు ఉన్న పార్టీపై మాటల తూటాలు పేల్చిన వారు కూడా..ఉన్నారు. కానీ, ఎందుకో.. ఇలా వెళ్లినా.. కొందరు ఆయా పార్టీల్లో హైలెట్ కాలేక పోయారు.
దీంతో ఇప్పుడు.. వారంతా ఎటూ కాకుండా ఉన్నారు. కానీ, వీరివల్ల తమకు లాభం ఉంటుందని భావిస్తున్న టీడీపీ, వైసీపీలు.. వారికి ఎరవేస్తున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఇస్తామని చెప్పకపోయి నా.. వారిని తమవైపు తిప్పుకొని.. భవిష్యత్తులో పదవులు ఇస్తామని ఆశ పెడుతున్నట్టు సమాచారం. ఇలాంటివారిలో వైసీపీ నుంచి వెళ్లినవారి జాబితా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ, గిడ్డి ఈశ్వరి, సుజయ్ కృష్ణరంగారావు సహా పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా టీడీపీ నుంచి వెళ్లి.. ఎలాంటి ప్రాధాన్యం లేకుండా వైసీపీలో ఉన్న వారిని టీడీపీ కూడా ఇలానే ఆహ్వానిస్తోంది. దీంతో ఈ నేతలు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వస్తుందో తేల్చుకునే పనిలో పడ్డారు. ఒక అంచనాకు వచ్చాక.. జంపింగుల పర్వం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
This post was last modified on May 8, 2023 6:59 am
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…