తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు నాలుగు మాసాల ముందుగానే.. సంచలన నిర్ణయం తీసుకుని అమల్లో పెట్టారు. రాష్ట్రంలో మద్యం ప్రియులను ఆకట్టుకునే నిర్ణయం తీసుకున్నారు. అదే..రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల మద్యం ధరలు తగ్గిపోయినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నామ సంవత్సరం కావడంతో మద్యం ప్రియులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ సర్కారు ఈ నిర్నయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆదాయాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో జనాలంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. అయినా.. పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అనూహ్యంగా మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో మద్యం ధరలు తగ్గిపోయాయి. బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. అధిక ధరలు కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తేల్చారు.
ఇకపై అలా ఉండకూడదని దీన్ని నియంత్రించేందుకు ధరలు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు తగ్గాయి. మరోవైపు.. కొన్ని రకాల బ్రాండ్స్‌లో ఫుల్ బాటిళ్లపై 60 రూపాయిల వరకు తగ్గిస్తున్నట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. కాగా తగ్గిన ఈ ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. అయితే.. తాజా నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా.. మద్యం ధరలు తగ్గించడం ద్వారా సర్కారు కేవలం ఎన్నికలను మాత్రమే చూస్తోందని అంటున్నారు.
This post was last modified on May 6, 2023 10:33 am
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…