ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య ఆధిపత్య పోరు ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో ముద్ర వేసుకున్నారు.
పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య అనుచరులతో టచ్‌లో ఉందని, ఒకటి రెండు సార్లు వారితో తెదేపా అధిష్టానం మాట్లాడిందని చెప్తున్నారు.
టీడీపీతో బాలినేని ప్రతినిధులు చర్చలు జరిపారని.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. పైగా టీడీపీ ఆయనకు చాలా మంచి ఆఫర్ ఇచ్చిందని ఒంగోలు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి దర్శి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి టీడీపీ పెద్దలు అంగీకరించారని చెప్తున్నారు. జగన్ సొంత కుటుంబానికి చెందిన నేతను తమ పార్టీలోకి తేవడం వల్ల ఆ పార్టీలో బలమైన నెగటివ్ సిగ్నల్ పంపినట్లవుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీ ఈ భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు.
ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నప్పటికీ దిల్లీ లిక్కర్ స్కాం రగడ కారణంగా ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో వైసీసీ అక్కడ వైవీ సుబ్బారెడ్డిని కానీ, ఆయన కుమారుడిని కానీ రంగంలోకి దించుతున్నట్లు చెప్తున్నారు. దీంతో బాలినేని ఎలాగైనా సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓడించాలన్న పట్టుదలతో టీడీపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు.
ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీకి అనుకూలత ఉండడంతో పాటు వైసీపీలో వర్గపోరు కారణంగా బాలినేనిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తే విజయం గ్యారంటీ అని టీడీపీ లెక్కలేస్తోంది. అయితే.. ఎంత సొంత అవసరమైనప్పటికీ రాజకీయంలో ఆరితేరిపోయిన బాలినేని ఇదే అదనుగా టీడీపీతో తన కుమారుడి టికెట్ వ్యవహారం కూడా ఫైనలైజ్ చేయించుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు చెప్తున్నారు. దర్శిలో తన కుమారుడు పోటీ చేస్తే అక్కడ టీడీపీ నేతల నుంచి పూర్తి సహకారం అందేలా పార్టీ పెద్దలు ఆదేశాలు ఇవ్వాలని.. ముఖ్యంగా ఎన్నికల నాటికి సిద్ధా రాఘవరావు వంటివారు తిరిగి టీడీపీలోకి వచ్చినా తన కుమారుడి టికెట్‌కు, విజయానికి ఢోకా లేకుండా చూడాలని బేరాలాడుతున్నారట.
This post was last modified on May 5, 2023 3:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…