Political News

దానం నాగేందర్ కు షాక్ తప్పదా ?

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని చోట్ల సిట్టింగుల వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధినేత కేసీఆర్ మరికొన్ని చోట్ల మాత్రం వారికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మీటింగులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని వారిని సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ దక్కదని హెచ్చరించారు.

కేసీఆర్ పునరాలోచనలో ఉన్న నియోజకవర్గాల్లో హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖైరతాబాద్ అభివృద్ధిపై నాగేందర్ అసలు దృష్టి పెట్టలేదని కేసీఆర్ కు రిపోర్టులు అందాయట. పండుగలకు, పబ్బాలకు వచ్చి జెండాలు ఎగురవేయడం, స్వీట్స్ పంచడం, స్లమ్స్ లో జనానికి కాసిని డబ్బులు పంచడం మినహా మౌలిక సదుపాయుల అభివృద్దికి, ఇతర పనులపై నాగేందర్ ఎలాంటి చొరవ తీసుకోలేదని అంటున్నారు

గత ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి తర్వాతి కాలంలో బీజేపీ చేరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న దాసోజు శ్రవణ్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. దాసోజు శ్రవణ్ మంచి వక్తే కాకుండా ఖైరతాబాద్ సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా ఆయనకు తెలుసని కేసీఆర్ కు నివేదికలు అందడంతో గులాబీ బాస్ ఆయన వైపు దృష్టి పెట్టారు.

నిజానికి శ్రవణ్ కు తొలుత ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నారు. అయితే తర్వాత మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్రవణ్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే దానం నాగేందర్ కు కష్టకాలం తప్పకపోవచ్చు…

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

44 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago