తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. యాత్ర 90వ రోజు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ, టీడీపీ అధికారానికి వస్తే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని జగన్ చెబుతున్నారు. యువగళానికి సీమ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
లోకేష్ కు వచ్చిన ప్రజాదరణ ఓర్వలేక దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను లోకేష్ ఎండగట్టడంతో అక్కడి వైసీపీ నేతలు తట్టుకోలేక ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాదయాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. చివరకు టీడీపీలోనే కొందరిని తమ వైపుకు తిప్పుకుని గొడవ చేయించారు. ఏదో జరుగుతోందని ముందే గ్రహించిన మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి అన్ని చోట్ల తనవారిని పెట్టేసి గొడవలు కాకుండా చూసుకున్నారు. అయినా ఒక చోట మాత్రం చిన్నపాటి గందరగోళం తప్పలేదు.
కోసిగిలో జరిగిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. లోకేష్ కూడా ఆవేశంగా ప్రసంగించారు. స్పీచ్ ముగుస్తున్న తరుణంలో కొంత మంది గొడవకు దిగారు. వారిని వారించడం కష్టమైంది. ఇంఛార్జ్ తిక్కారెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలిచ్చారు..
సభ ముగిసి విశ్రాంతి ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకునేందుకు లోకేష్ ప్రయత్నించడంతో అసలు సంగతి బయటపడింది. టీడీపీ టికెట్ కోసం పోటి పడుతున్న వారి పనేనని తెలిసింది. నియోజకవర్గం ఇంఛార్జ్ తిక్కారెడ్డిని కాదని తనకు టికెట్ ఇవ్వాలని ఉల్లిగయ్య ఎదురుచూస్తున్నారు. ఆ పని కుదరదని తెలియడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఉలిగయ్య బాధను అర్థం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. ఉలిగయ్య వర్గాన్ని తన వైపుకు తిప్పుకున్నారట.
కోసిగి మీటింగ్ చివర్లో ఉలిగయ్య వర్గమే ఇంఛార్జ్ అనుచరులతో గొడవ పడిందని లోకేష్ తెప్పించుకున్న రిపోర్ట్ లో తేలిందట. అయినా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలెయ్యాలని, అన్ని సంగతులు తాను చూసుకుంటానని తిక్కారెడ్డికి లోకేష్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ పని వైసీపీ వాళ్లు చేయించారని, అయితే టీడీపీలో కొందరు కోవర్టులు వారితో కలిసి పోవడమే బాధాకరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఉలిగయ్య వర్గంపై టీడీీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి…
This post was last modified on May 3, 2023 12:53 pm
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…