వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం జిల్లాలోని అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. జిల్లాలోని 10 సీట్లలో గడచిన రెండు ఎన్నికల్లోనో ఒక్కోసీటు మాత్రమే గెలుచుకుంది. అన్నీ సీట్లు లేదా కనీసం మెజారిటి నియోజకవర్గాలనైనా గెలవాలన్నది కేసీయార్ పట్టుదల. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు.
గడచిన రెండు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వచ్చేఎన్నికల్లో రిపీట్ కావద్దని బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో గండం ఎదురైంది. బీఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలవనివ్వనంటు చాలెంజ్ చేశారు. కేసీయార్ తో పొంగులేటికి వివాదం ముదిరిన కారణంగా పొంగులేటి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి కూడా ఖమ్మం జిల్లా కేసీయార్ కు కొరుకుడు పడటంలేదు.
ఖమ్మం జిల్లామీద ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రభావం కూడా కనబడలేదు. అసలు కేసీయార్ ప్రభావమే జిల్లామీద లేదు. దాంతో ఒక్కొక్క సీటులో మాత్రమే పార్టీ గెలిచింది. కాకపోతే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఎంఎల్ఏలను చేర్చుకోవటం ద్వారా తమకు మెజారిటి సీట్లున్నాయని అనిపించుకుంటున్నారంతే. ఇలా అనిపించుకోవటం కాకుండా డైరెక్టుగా తమ అభ్యర్ధులనే గెలిపించుకోవాలన్నది కేసీయార్ పట్టుదల.
కేసీయార్ ను దెబ్బకొట్టేందుకు పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో తెలీదు. మాజీ ఎంపీ మద్దతుదారుల సమాచారం ప్రకారం పొంగులేటి తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారట. కాంగ్రెస్ లో చేరితే మాత్రమే కేసీయార్ ను అడ్డుకోవటం సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారట. బీజేపీలో చేరితే తన టార్గెట్ రీచ్చవటం కష్టమని పొంగులేటికి కూడా అర్ధమైందట. అందుకనే తన మద్దతుదారులకు టికెట్లు ఖాయమైతే కాంగ్రెస్ లో చేరుతారట. మరి కేసీయార్, పొంగులేటి ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుంది ? ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 3, 2023 10:20 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…