కాంగ్రెస్ పార్టీకి అవసరమైన బూస్టప్ ఇవ్వటానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధి తెలంగాణాకు వస్తున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈనెల 8వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే నిరుద్యోగ బహిరంగత సభకు ముఖ్యఅతిధిగా ప్రియాంక హాజరుకాబోతున్నట్లు నేతలు చెబుతున్నారు. మొన్ననే 28వ తేదీన నల్గొండలో జరిగిన మొదటి నిరుద్యోగ బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ నేతలు ఫుల్లు జోష్ లో ఉన్నారు.
మొత్తం ఐదుచోట్ల నిరుద్యోగ బహిరంగసభలు నిర్వహించాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. ఇందులో ఒక సభ జరిగితే మరో నాలుగు బహిరంగసభలు జరగాల్సుంది. ఇందులో పాల్గొనేందుకే ప్రియాంక హైదరాబాద్ కు రాబోతున్నారట. ఎలాగూ బహిరంగసభలో పాల్గొంటారు కాబట్టి సీనియర్ నేతలతో కూడా భేటీ అవుతారని నేతలు చెబుతున్నారు. అసలు తెలంగాణాపైన ప్రియాంక ప్రత్యేక దృష్టిపెట్టారని, రెగ్యులర్ గా పర్యటనలు చేస్తారని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది.
అయితే ఎందుకనో అది జరగలేదు. అదే పద్దతిలో రాహుల్ గాంధి కూడా తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ ప్రయత్నాలకు సీనియర్లలో కొందరు స్పీడు బ్రేకులు వేస్తున్నారు. వీటన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ ను రెచ్చిపొమ్మని చెబుతున్నదీ అధిష్టానమే సీనియర్ల రూపంలో స్పీడు బ్రేకులు వేయిస్తున్నదీ అధిష్టానమే. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తులో వచ్చే అవకాశాలు దాదాపు తక్కువనే చెప్పాలి. అందుకనే రాహుల్ గాంధితో పాటు ప్రియాంక కూడా తెలంగాణాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రచారం జరుగుతున్నట్లు ఇన్చార్జిలుగా కాకుండా రెగ్యులర్ గా టూర్ చేయటం ద్వారా పార్టీకి జవసత్వాలు అందించాలని డిసైడ్ అయ్యారట. మరి గాంధీల ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందనేది కర్నాటక ఎన్నికల ఫలితాలపైన ఆధారపడుంటుందనటంలో సందేహంలేదు.
This post was last modified on May 2, 2023 2:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…