Political News

జ‌గ‌న్ సెల్ఫ్ గోల్స్ లో అదొకటి !

నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌ల్ల‌గుద్ది మ‌రీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు మావే అని చెప్పుకొన్న వైసీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు పెద్ద సంక‌టం వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో కూసాలు క‌దిలిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గాలు , మ‌రో 7 ఎస్టీల‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో గ‌తంలో కాంగ్రెస్ త‌ర్వాత‌.. అదే రేంజ్‌లో దూసుకుపోయిన పార్టీ వైసీపీ. టీడీపీ కొన్ని స్థానాల్లో మాత్ర‌మే బ‌లోపేతం అయింది. బీసీ జపం కార‌ణంగా.. టీడీపీ ఎస్సీల‌కు అటు ఇటుగా ఉంద‌నే టాక్ ఉంది.

దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క కొండ‌పి(ఉమ్మ‌డి ప్ర‌కాశం) నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఏడు ఎస్టీ స్తానాల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ 36 స్థానాల్లో ఒక‌టి రెండు మిన‌హా.. అన్ని చోట్లా వైసీపీదే విజ‌యం అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద క‌ష్టం వ‌చ్చింది. ఇదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌ను తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలోకి నెట్టేసింది.

కొన్నాళ్ల కింద‌ట‌ ముగిసిన అసెంబ్లీ స‌మావేశాల్లో ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ తేనెతుట్టెను వైసీపీ క‌దిలించింది. ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను ఎస్సీల్లోకి, బోయ‌, వాల్మీకి.. త‌దితర కులాల‌ను.. ఎస్టీల్లోకి చేరుస్తూ.. తీర్మానం చేయ‌డం.. దీనిని వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించ‌డం తెలిసిందే. ఇదే ఇప్పుడు సెగ‌లు పుట్టిస్తోంది. నిజానికి.. ఎస్సీలు ఇప్పుడు తేడా వ‌చ్చినా..ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏమైనా వారిని ఒప్పించేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, ఎస్టీల విష‌యంలో మాత్రం ఇది కుద‌ర‌దు.

వారు ఒక్క‌సారి మార్పు చెందితే.. ఇక‌, వారి ఓట్లు శాశ్వ‌తంగా వైసీపీకి దూర‌మ‌వుతాయి. ఇదే ఇప్పుడు వైసీపీలో నేత‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. క‌నీసం.. ఈ తీర్మానం చేసే ముందు.. ఎస్సీ, ఎస్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించి ఉంటే బాగుండేద‌ని. లేదా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఆయ‌న అంచ‌నా వేసుకుని ఉన్నా బాగుండేద‌ని.. ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డు తున్నారు. ఏదేమైనా.. ఇది ప్రభుత్వం వేసిన తొంద‌ర‌పాటు అడుగుగా పేర్కొంటున్నారు. ఇది.. పార్టీకి తీర‌ని న‌ష్టం చేకూరుస్తుంద‌ని చెబుతున్నారు.

This post was last modified on May 1, 2023 11:20 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago