మీడియా మీద కేసీయార్ తన పట్టు ఎలాగుంటుందో మరోసారి చూపించారు. కేసీయార్ అంటే యావత్ మీడియా ఎంతలా వణికిపోతోందో తాజా ఘటనలో అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను కేసీయార్ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ స్ధాయిలో సచివాలయాన్ని కేసీయార్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అంతాబాగానే ఉంది కానీ లోకల్లో మెజారిటి మీడియాను మాత్రం దూరంగానే ఉంచేశారు. ఎంపికచేసిన అతికొద్ది రిపోర్టర్లను మాత్రమే సెక్రటేరియట్ లోపలికి అనుమతించారు. మిగిలిన మీడియానంతా సెక్రటేరియట్ బయటకే నిలిపేశారు.
విచిత్రం ఏమిటంటే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఈసాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుండి మీడియా ప్రతినిధులను పిలిపించుకున్నది ప్రభుత్వం. వాళ్ళందరినీ రాచమర్యాదలతో లోపలకి తీసుకెళ్ళిన ప్రభుత్వం లోకల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వివక్ష చూపింది. లోకల్ మీడియాలో ఎంపికచేసిన అతికొద్ది రిపోర్టర్లను మాత్రమే లోపలకు అనుమతించిందట. లోకల్ మీడియాలో ఎవరిని అనుమతించాలి ? ఎవరిని బయటే ఆపేయాలనే నిర్ణయం ప్రగతిభవనే తీసుకున్నదని సమాచారం.
మామూలుగా ఇలాంటి భారీ ఈవెంట్లకు మీడియాపై బ్యాన్ పెట్టదు ప్రభుత్వం. కానీ ఇపుడు మాత్రం బ్యాన్ పెట్టేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జాబితాను తయారుచేసి పాసులు జారీచేస్తుంది. దాని ప్రకారమే రిపోర్టర్లకు పాసులు అందుతాయి. పాసులున్న వాళ్ళనే లోపలకు అనుమతిస్తారు. పాసులు జారీ చేసే సమయంలోనే ఎవరెవరికి పాసులు ఇవ్వాలనేది సంబంధిత శాఖకు తెలుసుకాబట్టి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు పౌర సంబంధాల శాఖ నిర్ణయం ఏమీలేదట.
పాసులు జారీచేయాల్సిన రిపోర్టర్ల జాబితాను ప్రగతిభవనే రెడీ చేసిందట. అంటే ప్రగతిభవన్ తయారు చేసిన జాబితా ప్రకారమే సమాచర శాఖ పాసులను పంపింది. అందుకనే మెజారిటి మీడియాను అధికారులు సెక్రటేరియల్ లోపలికి అనుమతించలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఈసాన్య రాష్ట్రాల మీడియాను ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రభుత్వం లోకల్ మీడియాను ఆపేసిందంటే అర్ధమేంటి ?
This post was last modified on May 1, 2023 11:39 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…