వైసీపీ అధినేత జగన్‌ను ఇప్పటి వరకు టార్గెట్ చేసిన టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తాజాగా.. ఆయన సతీమణి, సాక్షి మీడియా చైర్ పర్సన్ భారతీరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సవాళ్లు రువ్వారు. నేను రాజకీయాలు వదిలేస్తా.. భారతీ రెడ్డీ.. మీ మీడియాను మూసేస్తావా?
అని నారా లోకేస్ సవాల్ చేశారు. ప్రస్తుతం ఎమ్మిగనూరులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణం.. సాక్షి మీడియాలో నారా లోకేష్‌పై వచ్చిన కథనాలే.
నారాలోకేష్ ఏమన్నారంటే.. ఎస్సీలకు టీడీపీ అనుకూలం. నేను ఎస్సీలను ప్రేమిస్తా. కానీ, నేను మంత్రిగా ఉన్న సమయంలో నూ .. పార్టీ నాయకుడిగా కూడా వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాం. కానీ, భారతీరెడ్డి తన మీడియాలో నాపై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నారు. నేను ఎస్సీలకు వ్యతిరేకమని.. ఎస్సీలను దూషించానని. వారిని అవమానించానని ప్రసారం చేస్తున్నారు. దీనిని నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇటు నుంచిఇటే రాజకీయాలు వదిలేని వెళ్లిపోతా. అదేసమయంలో నిరూపించకపోతే.. భారతీ రెడ్డి తన మీడియాను మూసేస్తారా? ఈ సవాల్కు సిద్దమేనా?
అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
ఇదిలావుంటే, తనను ఆపడం జగన్ వల్ల కాదని లోకేష్ అన్నారు. జగన్ జనంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ధర్మవరంంలో రైతులు రోడ్డు మీద పడుకొని సమస్య పరిష్కారించాలని ఆందోళన చేశారని, కానీ వారిని జగన్ లాగి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంచల్ గూడా జైలును జగన్ జైలుగా మార్చే కొత్త జీవోను జగన్ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌ను మించిన మోసగాడు ఏపీలోనే లేడని విమర్శించారు. జగనన్నకు చెబుతామని జగన్ కొత్త కార్యక్రమం తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వినలేని వాడికి ఏం చెప్పినా ప్రయోజనం ఏంటని లోకేష్ ప్రశ్నించారు.
This post was last modified on May 1, 2023 7:32 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…