Political News

మారుతున్న ప‌వ‌నాలు.. క‌ర్ణాట‌కలో తాజా స‌ర్వే

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మ‌రో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది అనేక స‌ర్వేలు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా.. హంగ్ వ‌స్తుంద‌ని చెప్పాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తాజా స‌ర్వే వెల్ల‌డించింది. దీంతో అధికార బీజేపీ భారీగా నష్టపోనుంద‌ని వెల్ల‌డించింది. ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్స్‌ ఈ సంచలన విషయాలను వెల్లడించింది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని (కర్ణాటక) కాపాడుకోవడం ప్రస్తుతం బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం కాగా, బీజేపీ నుంచి పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, తాజా ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి వచ్చే సీట్లు ఆ పార్టీకి అంతగా అనుకూలంగా లేవు. సీఓటర్‌తో కలిసి ఏబీపీ న్యూస్ 17,772 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

పీనియన్ పోల్స్ అంచనాల ప్రకారం, 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 107 సీట్ల నుంచి 119 సీట్లు గెలుచుకుంటుంద ని తేలింది. బీజేపీకి 74 నుంచి 86 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక‌, కుమార‌స్వామి నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్ 23 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుుంది. ఇతరులు 5 సీట్లు వరకూ గెలుచుకుంటారు. ఓట్ల షేర్ ప్రకారం కాంగ్రెస్ కంటే బీజేపీ 5 శాతం వెనుకబడి ఉంది. కాంగ్రెస్ 40 శాతం ఓట్ షేర్ సాధించుకోనుండగా, బీజేపీకి 35 శాతం ఓట్ షేర్ వస్తుంది. జేడీఎస్‌ ఓట్ షేర్ 17 శాతంగా ఉండనుంది. ఇదే సమయంలో, ఇతరులకు 8 శాతం ఓట్లు వెళ్తాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనితీరు బాగుందని ఒపీనియన్ పోల్స్‌లో పాల్గొన్న 49 శాతం మంది అభిప్రాయపడగా, 33 శాతం బాగోలేదన్నారు. 18 శాతం మంది ఫరవాలేదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయంపై బసవరాజ్ బొమ్మైకి 31 శాతం మొగ్గుచూపగా, సిద్ధరామయ్యకు సానుకూలంగా 41 శాతం స్పందించారు. హెచ్‌డీ కుమార స్వామికి 22 శాతం మొగ్గుచూపగా, క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్‌ డి.శివకుమార్‌కు 3 శాతం, ఇతరులకు 3 శాతం మొగ్గుచూపారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ది..
కర్ణాటక ఓటర్లు నిరుద్యోగం ప్రధాన అంశంగా భావిస్తున్నారు. నిరుద్యోగం ప్రధానాంశమని 30 శాతం మంది అభిప్రాయపడగా, కనీస వసతుల అంశంపై 24 శాతం మంది, విద్యపై 14 మంది, అవినీతి ప్రధానాంశమని 13 శాతం మంది, శాంతి భద్రతల అంశం ప్రధానమని 3 శాతం మంది, ఇతర అంశాలకు 16 శాతం మంది మొగ్గుచూపారు.

This post was last modified on April 30, 2023 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

18 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

58 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago