“మీరు మాకు ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆలోచించుకోవాలి. మీరు కాదంటే.. మమ్మల్ని ఆహ్వానించేవా రు లేరని అనుకోవద్దు. మాకు ఉండాల్సిన మార్గాలు.. మాకు ఉన్నాయి. కనీసం మీరు మమ్మల్ని కన్నెత్తి పలకరించడమే మానేశారు. మేం మీకు ఎందుకు అండగా ఉండాలి” -ఇదీ.. అత్యంత కీలకమైన మంగళ గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిని ఉద్దేశించి.. ఆయన అభిమానులు చెబుతున్న మాట.
ఎక్కడో ఆఫ్ దిరికార్డుగానో.. తెరచాటుగా సెల్ఫీ వీడియోల్లోనో చెప్పిన మాట కాదు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు అత్యంత ఆగ్రహంతో ఉన్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే క్షేత్రస్థా యి నాయకులు ముక్తకంఠంతో చెప్పిన మాట ఇది. దీంతో నాయకులను , కార్యకర్తలను సర్దు బాటు చేయలేక .. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తర్జన భర్జన పడ్డారు.
ఈ సందర్భంగా ఒకరిద్దరు కాదు.. ఏకంగా.. గుండుగుత్తగా.. మెజారిటీ కార్యకర్తలు , నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి గత రెండు ఎన్నికల్లో నూ.. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజ కవర్గం నుంచి విజయం దక్కించుకుంటున్నారు. ఈయనకు కార్యకర్తలు బాగానే సహకరిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నారాలోకేష్ పోటీ చేసినా, నందమూరి బాలయ్య ప్రచారం చేసినా.. ఆళ్ల విజయం దక్కించుకున్నారు.
అదేసమయంలో కీలకమైన దుగ్గిరాల మునిసిపాలిటీని దక్కించుకోవడంలోనూ.. ఆళ్లకు కార్యకర్తలే అం డగా నిలిచారు. అయితే.. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా.. గత నాలుగేళ్లుగా.. ఆళ్ల వీరిని పట్టించుకోవడం మానేశారు. దీనిపై కొన్నాళ్లుగా సర్వేల నుంచి కూడా.. ఆళ్లకు డేంజర్ బెల్స్ మోగుతున్నా యని నివేదికలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అలెర్ట్ అయిన.. వైసీపీ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు నిప్పులు చెరిగారు. మరి ఎన్నికల నాటికి ఈ పరిస్తితి సర్దుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on April 30, 2023 12:24 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…