ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ గ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్కడో విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ వాదనలు ఎలా ఉన్నా ఆయన మాత్రం.. సినిమా షూటింగులకు పరిమితం అయ్యారు.
పోనీ.. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. తనకు కుదరకపోతే .. ఇతర నేతలను రంగంలోకి దింపి.. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆయన ఎక్కడా ఎలాంటి వ్యూహంతోనూ ముందుకు సాగడం లేదు. పైగా.. ఇంకేముంది.. వారాహి వాహనాన్ని రంగం లోకి దింపుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే యాత్రలు సాగిస్తానన్నారు. దీంతో పార్టీలోనూ.. అభిమానుల్లోనూ ఆశలు పెల్లుబికాయి.
కానీ, ఇప్పటి వరకు వారాహి.. రంగంలోకి దిగింది లేదు. పోనీ.. ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే విషయం పైనా క్లారిటీ లేదు. అంతిమంగా చూస్తే.. జనసేన పార్టీ ఒక వ్యూహం లేని.. ఒక సూత్రం లేని పార్టీగా మిగిలి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఆయన ఒక నిర్ణయంతీసుకుంటారో .. లేక ఎన్నికల వరకు వేచి ఉంటారో చూడాలి. ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. దీంతో వ్యక్తిగతంగా పార్టీని డెవలప్ చేసే విషయంపై ఇప్పటి వరకు పవన్ నిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం.
This post was last modified on April 30, 2023 12:22 pm
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…