వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా హఠాత్తుగా నలుగురు ఎమ్మెల్యేలు కొన్ని రోజుల పాటు రాజకీయ తెరపై హల్చల్ చేవారు. వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణయంతో వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు. అదేసమయంలో సదరు ఎమ్మెల్యేలకు సింపతీ పెరిగిందనే వాదన బలంగా వినిపించింది. అయితే.. ఆ అనూహ్య మెరుపులు హఠాత్తుగా కనిపించడం మానేశాయి. దీంతో ఆ నలుగురు సైలెంట్ అయ్యారే అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని తీసుకుంటే.. గత ఏడాదికి ఇప్పటికీ ఆయన గ్రాఫ్ పెరిగింది. గత ఏడాదిఇదే సమయంలో ఆయన పర్యటనలకు వెళ్తే.. పెద్దగా రెస్పాన్స్ ఉండేదికాదు.. కానీ ఇప్పుడు ఆయన తమ గ్రామాలకు రావాలని.. తమ ప్రాంతాలకు రావాలని కోరుతున్నవారు పెరుగుతున్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి మంచి పనిచేశారంటూ.. నెటిజన్లు కూడా ఆయనకు మద్దుతు తెలిపారు. కొన్ని రోజులు హడావుడి చేశారు. తర్వాత.. ఏమైందో ఏమో మళ్లీ సైలెంట్ అయ్యారు.
ఉండవల్లి శ్రీదేవి అసలు.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చినా.. ఓడిపోతారని.. బలంగా నమ్మిన వైసీపీ.. ఎన్నికల వరకు ఆమెను ఆ స్థానంలో అలానే ఉంచేసి ఉంటే పరిస్థితి అలానే ఉండేది. కానీ, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించడం ద్వారా.. ఇప్పుడు సంపతీ పెరిగింది. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. గెలిపిస్తామంటూ.. ఆమెకు ఇక్కడిప్రజలు చెబుతున్నారు. ఇక, టీడీపీ వైపు మళ్లు తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియడం లేదు.
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొన్నాళ్లు పార్టీకి , కార్యక్రమాలకు, నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్న ఆయన విషయంలో అసంతృప్తి పెరిగింది. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నా రు. దీంతో నియోజకవర్గంంలో ఆయన మాట వినిపించడం మానేసింది. ఇలాంటి సమయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లారు. నేను పార్టీకోసం ఎంతో చేస్తే.. పార్టీ నాకు.. ఇంత సత్కారం చేసిందన్న వాదన వినిపించారు. అయితే.. అనూహ్యంగా ఆయన కూడా సైలెంట్ అయ్యారు.
ఆనం రామనారాయణరెడ్డి విషయంలో సింపతీ ఎలా ఉన్నా.. ఆత్మకూరులోఆయన రావాలని కోరుతున్న వారు ఏడాది కాలంగా పెరుగుతున్నారు. గౌతంరెడ్డి మరణం తర్వాత.. ఆయన సోదరుడు గెలిచినా.. ఆనం వర్గం మాత్రం బలంగానే ఉంది. ఇప్పుడు దీనికి తోడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. పార్టీలో ఆయనను వెలివేసిన ట్టుగా వ్యవహరించడం వంటివి మరింతగా గ్రాఫ్ పెంచాయి. ఈయన మాత్రం ప్రస్తుతం కొంత దూకుడుగానే ఉన్నారు. ఏదేమైనా… అప్పటి టెంపోను అలానే కొనసాగించడంలో ఆ నలుగురు కొంత వెనుకబడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 30, 2023 10:29 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…