తాజాగా తలైవా రజనీకాంత్ వ్యవహారం.. ఏపీలో మాటల మంటలు రేపుతోంది. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు.. టీడీపీ అంకురార్పణ చేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఈ కార్యక్రమాలను గ్రామ గ్రామాన.. పల్లెలు పట్టణాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలకు బాసటగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానం చేసింది. దీనిలో భాగంగా.. విజయవాడ శివారులో ఎన్టీఆర్ శత జయంతి అంకురార్పణ సభను నిర్వహించారు. దీనికి తమిళ సూపర్ స్టార్ రజనీ హాజరయ్యారు.
గతంలో ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న నేపథ్యంలోనూ.. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనూ రజనీ పిలవ గానే ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు. చంద్రబాబు అధికారంలో కూడా లేరు. పోనీ.. ఏదో చేసేస్తారులే అనుకుని రజనీ రావడానికి. ఆయన ఎలాంటి దురుద్దేశం లేకుండానే వచ్చారు. ఎలాగూ వచ్చిన తలైవా.. ఎన్టీఆర్ శతజ.యంతి కార్యక్రమాన్నినిర్వహించడాన్ని స్వాగతించారు. గతంలో ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
పైగా రజనీ ఈ సందర్భంగా.. `నాకు రాజకీయాలు మాట్టాడాలని ఉంది. . కానీ.. ఇప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడను“ అని చాలా వినయంగా చెప్పారు. మధ్య మధ్యలో నేనేమైనా ఎక్కువగా మాట్లాడుతున్నానా? అని కూడా సభికులను ప్రశ్నించి.. వినయం ప్రదర్శించారు. ఇక, చంద్రబాబు విజన్‌ను అందరూ మెచ్చుకున్నట్టే(వైసీపీ తప్ప. ఆఖరుకు బద్ధ శత్రువులు పొరుగు రాష్ట్ర అధికార పార్టీ వాళ్లు కూడా మెచ్చుకున్నారు కదా!) రజనీ కూడా మెచ్చుకున్నారు. కానీ, తలైవా ఏదో తప్పు చేసేసినట్టు.. ఎన్టీఆర్ ను పొగడడం పాపమైపోయినట్టు వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు.
ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి రోజాలు ఇద్దరూ కూడా.. రజనీపై నోరు చేసుకున్నారు. ఆయనకు కామన్ సెన్స్ ఉందా? అని ఒకరు.. ఆయన అమ్ముడు పోయాడు.. షూటింగులు లేక ఇంట్లో ఉంటో.. డబ్బులిచ్చి.. చంద్రబాబు తీసుకువచ్చాడు.. అంటూ నోరు చేసుకున్నారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌కు షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు ఇలా చేశాడంటూ.. తంపులు పెట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. మరి.. ఎన్టీఆర్‌ను పొగిడే హక్కు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదా? లేక.. ఏమైనా ఎన్టీఆర్‌పై వైసీపీ పేటెంట్ తెచ్చుకుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు మాట్లాడను అని చెప్పిన రజనీపై ఇలా నోరు చేసుకోవడం.. వల్ల వారి పరువే పోతుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.
This post was last modified on April 29, 2023 5:43 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…