Political News

ర‌జ‌నీ కామెంట్స్‌పై.. మీమ్స్ ఎటాక్‌.. ఏం జ‌రిగింది?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఏపీలో ప‌ర్య‌టించారు. టీడీపీఅధినేత చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ఆయ‌న ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌-2040 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు.

అంతేకాదు.. 1996లో చంద్రబాబు తన విజన్‌-2020 ప్రణాళిక ద్వారా డిజిటల్‌ వరల్డ్‌ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి ఉన్న భవిష్యత్‌ గురించి చెప్పారు. చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా మార్చారని తెలిపారు. బిల్‌గేట్స్‌ లాంటి బిజినెస్‌ టైకూన్స్‌ వచ్చి అభినందించడమే కాదు.. వాళ్ల కంపెనీలను ఇక్కడ ప్రారంభించారని, దీనికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌న్నారు. ఇప్పుడు లక్షలాదిమంది తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా.. లగ్జరీగా బతుకుతున్నారంటే దానికి చంద్రబాబే కారణమ‌ని ప్ర‌శంసించారు.

“తర్వాత 22 ఏళ్ల తర్వాత నేను మొన్న హైదరాబాద్‌ వెళ్లాను. రాత్రిపూట బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌ మీదుగా వెళ్లాను. న్యూయార్క్‌లో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా అని అనిపించింది. హైదరాబాద్‌ నగరం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రశేఖరరావు (తెలంగాణ సీఎం కేసీఆర్‌) కూడా ఇదే విషయాన్ని చెప్పారు“ అని ర‌జ‌నీ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై తెల్లారే స‌రికి.. మీమ్స్ ఎటాక్ చేశాయి. తాజాగా శుక్ర‌వారం రాత్రి, శ‌నివారం ఉద‌యం కురిసిన వ‌ర్షాల‌కు.. హైద‌రాబాద్ మునిగిపోయింది.

ఎక్క‌డిక‌క్క‌డ నీరు నిలిచిపోయింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర మోకాళ్ల లోతులో నీళ్లు చేరాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  ఈ ప‌రిస్తితిపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. మీమ్స్‌తో అద‌ర గొడుతున్నారు. ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఎటాక్ చేస్తున్నారు. “ఇక్క‌డ  నిన్న న్యూయార్క్ ఉండాలి క‌దండీ.. కొత్త‌గా ఈ వాట‌ర్ స్పోర్ట్స్ ఏంటి?“ అంటూ.. త‌లైవా ర‌జ‌నీ బొమ్మ‌తో .. కామెంట్లు కుమ్మ‌రించారు. ప్ర‌స్తుతం ఈ మీమ్స్ సోష‌ల్ మీడియాను అద‌ర గొడుతున్నాయి.

This post was last modified on April 29, 2023 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

25 minutes ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

1 hour ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

5 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

5 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

8 hours ago