బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలతో సెల్ఫీ వీడియో ఒకటి పోస్టుచేశారు. తనలాంటి వాణ్ణి ఏ పార్టీ కూడా భరించదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. బీజేపీని వీడే ప్రశ్నే లేదని ఆయన వివరణ ఇచ్చారు. దీనికి ముందు ఏం జరిగిందంటే.. రాజాసింగ్ త్వరలోనే తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. దీనికి సంబంధించి.. చర్చలు కూడా పూర్తయ్యాయని.. చంద్రబాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
గతంలో టీడీపీలోనే పనిచేసిన రాజాసింగ్ సహజంగానే టీడీపీలోకి వస్తున్నారనే చర్చ జరిగింది. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ తెరమీదికి రావడంతో.. ఆయన తాజాగా సెల్ఫీ వీడియోద్వారా వివరణ ఇచ్చారు. తన మనస్తత్వానికి ఏ పార్టీ కూడా సరిపోదని అన్నారు. తాను మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో హటాత్తు గా.. తన గురించి వచ్చిన వార్త విషయం తెలిసిందని.. దానిని తానే ఆశ్చర్య పోయానని ఆయన అన్నారు. బీజేపీ తనను సస్పెండ్ చేసినా.. తను ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు.
అంతేకాదు.. తాను హిందూ ధర్మాన్ని పట్టుకుని రాజకీయాలు చేస్తున్న నాయకుడినని రాజాసింగ్ చెప్పారు. కాబట్టి.. తనను ఏ పార్టీ కూడా భరించలేదని.. భరించేది ఏదైనా ఉంటే.. అది బీజేపీ మాత్రమేనని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను పార్టీ మారేది లేదన్నారు. తనను సస్పెండ్ చేయడానికి కారణాలు ఉన్నాయని.. అయితే.. త్వరలోనే తన సస్పెన్షన్ ఎత్తేస్తారని.. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ బీజేపీ పార్టీ తరఫునే పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు.. తనకు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా కేంద్ర మంత్రుల నుంచి బలమైన మద్దతు ఉందని.. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారని.. రాజా సింగ్ వివరించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అనుచరులను ఆయన కోరారు.
This post was last modified on April 29, 2023 4:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…